Last Updated:

Jack Dorsey: ఉద్యోగులకు సారీ.. ట్విటర్ ఫౌండర్ జాక్ డార్సీ

ట్విటర్ ను టేకోవర్ చేసిన ఎలన్ మస్క్ ఉద్యోగులపై భారీ స్థాయిలో వేటువేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్విటర్ ఫౌండర్ భాదాకరంగా ఓ సందేశాన్ని అందించారు. తనపై ఉద్యోగులు కోపంగా ఉన్నారని తనకు తెలసన్నారు.

Jack Dorsey: ఉద్యోగులకు సారీ.. ట్విటర్ ఫౌండర్ జాక్ డార్సీ

Twitter founder Jack Dorsey: ట్విటర్ ను టేకోవర్ చేసిన ఎలన్ మస్క్ ఉద్యోగుల పై భారీ స్థాయిలో వేటు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్విటర్ ఫౌండర్ భాదాకరంగా ఓ సందేశాన్ని అందించారు. తనపై ఉద్యోగులు కోపంగా ఉన్నారని తనకు తెలసన్నారు. ప్రస్తుతానికి కంపెనీలో నెలకొన్న పరిస్ధితులకు తనదే బాధ్యతగా చెప్పుకొచ్చారు.

ట్విటర్‌లో ప‌నిచేసిన వారంద‌రి ప్రేమ‌, ఆప్యాయ‌త‌లు ఎన‌లేనివ‌ని డార్సీ ట్వీట్ చేశారు. వారంతా అప్ప‌టికీ, ఇప్ప‌టికీ మ‌నోధైర్యంతో, దృఢంగా ఉన్నార‌ని, ఎలాంటి సంక్లిష్ట స్ధితిలోనూ తట్టుకొంటూ సరైన దిశ‌గా ప‌య‌నిస్తార‌ని చెప్పుకొచ్చారు. ట్విట్ట‌ర్‌ను మ‌స్క్ కొనుగోలు చేసిన అనంత‌రం సీఈఓ ప‌రాగ్ అగ‌ర్వాల్‌, ఉన్న‌తోద్యోగి విజ‌య గ‌ద్దె స‌హా దాదాపు 3500 మందికి పైగా ఉద్యోగుల‌ పై వేటు వేసిన క్రమంలో జాక్ డార్సీ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

ఇది కూడా చదవండి: Twitter : ట్విట్టర్ లో భారీ తొలగింపులు.. ఆఫీసుల మూసివేత

ఇవి కూడా చదవండి: