Volkswagen Virtus Offers: ఫోక్స్‌వ్యాగన్ కార్లపై క్రేజీ ఆఫర్లు.. వర్టస్‌పై లక్షల్లో డిస్కౌంట్స్.. ఎంతో తెలిస్తే ఎగబడతారు..!

Volkswagen Virtus Offers: భారతీయ వాహన మార్కెట్లో ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్ వ్యాగన్ తనదైన ముద్ర వేసుకుంది. టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి తయరీదారుల నుంచి బలమైన పోటీ వస్తున్నప్పటికి వాటిని తట్టుకొని నిలబడింది. తాజాగా కంపెనీ వర్టస్ సెడాన్ కారును తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఏప్రిల్ నెలలో మిగిలిన MY2024 స్టాక్‌పై రూ. 1.50 లక్షల వరకు భారీ తగ్గింపు ఇస్తుంది. అలానే కస్టమర్లు దాని MY2025 స్టాక్‌పై కూడా చాలా ప్రయోజనాలను పొందచ్చు.
Volkswagen Virtus Offers
నివేదికల ప్రకారం.. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ MY2024 పాత స్టాక్ డీలర్ల వద్ద మిగిలి ఉంది. దానిపై రూ. 1.50 లక్షల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ తగ్గింపులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ బోనస్ ఉన్నాయి. అలానే మీరు ఈ కారు కొత్త MY2025 మోడల్‌ని కొనుగోలు చేయబోతున్నట్లయితే, మీరు దానిపై రూ. 70,000 వరకు ప్రయోజనాన్ని పొందచ్చు. ఈ ఆఫర్ల గురించి మరింత సమాచారం కోసం మీరు డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.
ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ బేస్ మోడల్ (MY2025) ధర రూ. 10.44 లక్షల నుండి రూ. 19 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్. ఇంజన్ గురించి మాట్లాడితే ఈ కారులో 1.0L 3 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 114బిహెచ్‌పి పవర్, 178ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఒక లీటరులో 20kmpl మైలేజీని అందిస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉన్నాయి.
స్పేస్ గురించి మాట్లాడితే ఈ కారులో మీకు చాలా మంచి స్థలం లభిస్తుంది. అందులో 5 మంది సులభంగా కూర్చోవచ్చు. మీరు దాని బూట్‌లో కూడా మంచి స్థలాన్ని పొందుతారు. అందులో సామాను ఉంచుకోవడానికి చాలా స్థలం ఉంది. సిటీ డ్రైవ్ నుండి హైవే వరకు ఈ కారు మెరుగ్గా ఉంటుంది.
హ్యుందాయ్ తన ఫేమస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయోనిక్ 5పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ వాహనం 2024 మోడల్‌పై రూ. 4 లక్షల పెద్ద తగ్గింపు అందిస్తున్నారు. కంపెనీ తన మిగిలిన స్టాక్‌ను క్లియర్ చేయడానికి ఈ తగ్గింపును ఇస్తోంది. అయోనిక్ 5 జనవరి 2023లో రూ. 44.95 లక్షలతో ప్రవేశపెట్టారు. అప్పటి నుండి దాని ధర రూ. 46.05 లక్షలకు పెరిగింది.
ఇవి కూడా చదవండి:
- Top Suvs Waiting Period: అబ్బబ్బా ఏమి డిమాండ్ రా సామీ.. ఈ మూడు కార్లు కావాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే..!