Home / ఆటోమొబైల్
చైనాకు చెందిన యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పబ్జీ ని కూడా బ్యాన్ చేశారు. దీంతో దక్షిణ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ క్రాఫ్టన్ ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ పేరుతో కొత్త గేమ్‌ను పరిచయం చేసింది.
టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తమ డేటాను అక్రమంగా ఉపయోగించుకుంటోందని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు ట్విటర్ లేఖ రాసింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ దిగ్గజం శామ్ సంగ్ భారత్‌లో ‘క్రిస్టల్ 4కే ఐస్మార్ట్ యూహెచ్డీ టీవీ 2023’ను లాంచ్ చేసింది. 43 ఇంచులతో మొదలై పలు సైజుల్లో ఈ టీవీ అందుబాటులో ఉంది. ఈ టీవీలో పరిసరాల్లోని వెలుతురుకు తగ్గట్టుగా ఆటోమేటిక్‌గా బ్రైట్ నెస్ ను సర్దుబాటు చేసే ఐఓటీ పనిచేసే సెన్సర్లు ఇచ్చారు.
Meta Layoffs: మెటా కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా 11 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వారంలో మరోసారి వేలాది మంది ఉద్యోగులకు లే ఆఫ్ షాక్ ఇవ్వనున్నట్టు పలు నివేదికలు వెల్లడించాయి.
Electric vehicles: ప్రస్తుతం విద్యుత్ వాహనాలపై ఇస్తున్న సబ్సిడీకి కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఫేమ్ 2 పథకం కింద 40 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. అయితే ఈ పథకం కొనసాగుతుందా? లేదా? అని చాలా కాలంగా సందేహాలు నెలకొన్నాయి. దీంతో ఈవీ వాహనాల కొనుగోళ్లపై ప్రభావం పడుతోంది. కానీ తాజాగా ఈ అంశంపై భారీ పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఒక వేళ ప్రణాళికలు నిజం […]
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ మరో కొత్త మోడల్ ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో రియల్ మీ నజ్రో N53 పేరుతో సరికొత్త వేరియంట్ ను తీసుకొచ్చింది.
Realme 11 Pro: కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారు. అయితే కొద్దీ రోజులు ఆగండి.. మీ అభిరుచికి తగిన మెుబైల్ మార్కెట్ లోకి త్వరలో అందుబాటులోకి రానుంది.
Vodafone Layoffs: బ్రిటీష్ టెలికాం దిగ్గజ కంపెనీ వొడాఫోన్ వచ్చే మూడేళ్లలో 11 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్లు తెలిపింది.
జియో సినిమా యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి దాదాపు 10 కోట్ల పైగా యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారని తెలుస్తోంది. ఐపీఎల్ 2023 మ్యాచ్ లను ఉచితంగా 4కే క్వాలిటీపై జియో సినిమా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటోరోలా త్వరలో మోటో వాచ్‌లను విడుదల చేసేందుకు సిద్దం అయింది. కొన్ని కీలక స్పెక్స్, డిజైన్లతో టెస్ట్ స్మార్ట్‌వాచ్‌లను వెబ్సైట్లో వెల్లడించింది.