Last Updated:

Kia Electric Van PV 5: కియా మాస్టర్ ప్లాన్.. ఓమ్నీ లుక్ కొత్త వ్యాన్.. ఫ్యామిలీ టూర్లకు పర్ఫెక్ట్..!

Kia Electric Van PV 5: కియా మాస్టర్ ప్లాన్.. ఓమ్నీ లుక్ కొత్త వ్యాన్.. ఫ్యామిలీ టూర్లకు పర్ఫెక్ట్..!

Kia Electric Van PV 5: భారత్‌లో వ్యాన్ అంటే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది మారుతి సుజికి ఓమ్నీ. చాలా మందికి ఇది మర్చిపోలేని వాహనంగా అందరి మనసులో నిలిచిపోయింది. రోడ్లపై ఈ వాహనం దుమ్ములేపుతూ రయ్ మంటూ దూసుకుపోతుంటే చూడటానికి మాములుగా ఉండదు. చాలా సినిమాల్లో ఈ వ్యాన్‌ని కిడ్నాపర్స్ వాహనంగా ఉపయోగించారు. నిజ జీవితంలో కూడా ఈ వ్యాన్‌ను చూస్తే జనాల్లో అదే ఫీలింగ్.

ఈ వ్యాన్‌ను సరుకు రవాణాకే కాకుండా, ప్యాసింజర్, అంబులెన్స్, స్కూల్‌కు పిల్లలను తీసుకెళ్లే వాహనంగా ఆటోమార్కెట్లో ముద్రను వేసింది. ఓమ్నీ వ్యాన్ తర్వాత దాని స్థానాన్ని భర్తీ చేసేందుకు చాలా వాహనాలు వచ్చినప్పటికీ ఏ మోడల్ అటువంటి ఆదరణ సంపాదించలేకపోయింది. అయితే ఇప్పుడు తాజాగా ఆ స్థానాన్ని దక్కించుకొనేందుకు దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ సిద్ధమైంది. ఈ వ్యాన్ పేరు ‘PV5’. ఇది ఎలక్ట్రిక్ వెహికల్.

కియా ఈ వ్యాన్‌ను CES 2024లో ప్రదర్శించిన PV5 కాన్సెప్ట్ మోడల్ ఆధారంగా తయారు చేస్తుంది. బియాండ్ వెహికల్ (PBV) ప్లాట్‌ఫామ్ కింద వస్తున్న ఫస్ట్ మోడల్ ఇది. ఈ వ్యాన్ చూడటానికి మారుతి సుజికి ఓమ్నీలా ఉంటుంంది. అయితే వ్యాన్ బాడీ చూడటానికి పెద్దగా ఉంటుంది. దీనిని త్వరలోనే గ్లోబల్ మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ ప్రయత్నిస్తోంది.

అయితే ఈ వ్యాన్ ఇండియన్ రోడ్లపైకి ఎప్పుడు వస్తుందనే దాని గురించి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం భారత్ ఆటోమొబైల్ మార్కెట్లో కీలకంగా మారింది. అంతర్జాతీయంగా ఏ మోడల్ లాంచ్ అయిన, ఆ వాహనాలు కొన్ని మార్పులతో దేశంలో విడుదల అవుతున్నాయి. దేశం వాహన పరిశ్రమకు అనుకూలంగా ఉండటం వల్ల చాలా లాంచ్‌లు స్థానికంగా కూడా జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో కియా ఎలక్ట్రిక్ వ్యాన్ PV5 ఇండియాలోకి కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే కంపెనీ నుంచి అధికారికి ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. ఈ వాహనాన్ని కియా సరుకులు, ప్రయాణికులను రవాణా చేసే విధంగా రూపొందిస్తుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎలక్ట్రిక్ వెహికల్ డే సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉంది.