Best 125cc Bikes: 125 సీసీలో ఈ నాలుగు బైకులు తోపు.. దూకుడులో టాప్ గేర్.. ఇప్పుడు ఐఫోన్ ధరకే కొనచ్చు..!
Best 125cc Bikes: దేశంలో టూవీలర్ల మార్కెట్ టాప్ గేర్‌లో దూసుకెళ్తుంది. నిత్యం వివిధ కంపెనీలు సరికొత్త బైకులను విడుదల చేస్తున్నాయి. ప్రజలు కూడా తమ అవసరాలకు అనుగుణంగా ఎంచుకుంటున్నారు. యువత, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలకు తగ్గట్టుగా వివిధ మోడళ్లు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం స్పోర్ట్స్ కమ్యూటర్ బైక్‌ల డిమాండ్ వేగంగా పెరుగుతుంది. సాధారణ బైక్స్‌తో పోలిస్తే ఇవి కాస్త హై పవర్ కలిగి ఉంటాయి. కొండలు, గుట్టలను కూడా అవలీలగా దాటేస్తాయి. ఈ సెగ్మెంట్‌లో టీవీఎస్ రైడర్ 125, హోండా ఎస్పీ 125, బజాజ్ పల్సర్ 125, హీరో ఎక్స్‌ట్రీమ్ 125 ఆర్ ఉన్నాయి. ఈ బైక్‌లను రూ.లక్ష లోపే కొనుగోలు చేయొచ్చు. రండి ఈ ఐదు బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం.
TVS Raider 125
రూ. 1 లక్షలోపు అత్యుత్తమ 125 cc బైక్‌ల జాబితాలో రైడర్ 125ని మొదటి స్థానంలో ఉంటుంది. కస్టమర్లు కేవలం రూ.85 వేల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు. దీనిలో iGO అసిస్ట్ టెక్‌తో కూడిన 125 cc ఇంజన్ ఉంటుంది. ఇది 11.2 బిహెచ్‌పి పవర్, 11.75 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Honda SP 125
హోండా ఫేమస్ 125 cc బైక్ హోండా SP 125 జాబితాలో రెండవ స్థానంలో ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.87.5 వేలు. కంపెనీ 123.94 లీటర్ ఇంజన్‌తో SP 125ని అందిస్తోంది. ఈ పవర్‌ట్రెయిన్ 10.72 బిహెచ్‌పి పవర్, 10.9 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.
Bajaj Pulsar N125
బజాజ్ దాని పల్సర్ లైనప్‌లో అనేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు తమ అవసరాన్ని బట్టి వీటిని ఎంచుకోవచ్చు. సరసమైన ఎంపిక గురించి మాట్లాడితే, బజాజ్ పల్సర్ N125ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.92,704 వద్ద ఉంది. ఇది 11.8 బిహెచ్‌పి పవర్, 11 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 125 సిసి ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.
Hero Xtreme 125R
మీరు ఒక నమ్మకమైన కంపెనీ నుండి స్పోర్ట్స్ బైక్‌ను గొప్ప డిజైన్‌తో కొనుగోలు చేయాలనుకుంటే అది రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో ఉంటుంది. అప్పుడు Xtreme 125R మీకు మంచి ఎంపిక కానుంది. కంపెనీ దీనిని IBS వేరియంట్‌తో కేవలం రూ.95 వేల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకే విక్రయిస్తోంది. ఇది 125 సిసి కెపాసిటి గల ఇంజన్‌ని పొందుతుంది, ఇది 11.4 బిహెచ్‌పి పవర్, 10.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.