Home /Author
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు వసంత్ విహార్ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఈ సంఘటన ఈ నెల 6న జరగ్గా, పోలీసులకు 8వ తేదీన ఫిర్యాదు అందింది. అత్యాచారానికి పాల్పడిన 23 , 25, 35 ఏళ్ల వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. దీంతో పాటు పోస్కో యాక్ట్ కింది కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఓ వైపు కరోనాతో సతమతమవుతున్న ప్రజలపై వైరస్లు దండయాత్ర మొదలుపెట్టాయి. ఇప్పటికే కరోనాతో పాటు జికా వైరస్లు దేశంలో వ్యాప్తి చెందుతుండగా.. ఇప్పుడు దానికి మంకీపాక్స్ తోడైంది. ఈ మహమ్మారి తొలికేసు కేరళలో నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ వెల్లడించారు. ఈ నెల 12న యూఏఈ నుంచి తిరువనంతపురానికి వచ్చిన కొల్లాంకు చెందిన
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ 'పుష్ప - ది రైజ్' మరో రికార్డును నెలకొల్పింది భారతదేశంలో 5 బిలియన్ల వ్యూస్ సాధించిన మొట్టమొదటి ఆల్బమ్‌గా ఈ చిత్రం మరో రికార్డును సాధించింది. సోషల్ మీడియాలో చిత్ర నిర్మాతలు పోస్టర్‌ను పంచుకున్నారు
’చంద్రముఖి‘ దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు రూపొందించబడిన వినోదభరితమైన హారర్ డ్రామాలలో ఒకటి. ఈ సినిమా తెలుగు, తమిళ బాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పి వాసు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను చంద్రముఖి 2
ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్ శుక్రవారం ఉదయం చెన్నైలో మరణించారు. 70 ఏళ్ల వయసున్న ఈ నటుడు చెన్నైలోని తన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో, అతను 100 చిత్రాలలో నటించి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రతాప్ ఆగస్టు 1952లో జన్మించాడు. ముంబై యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్‌గా తన వృత్తిని ప్రారంభించారు.
దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ సూపర్ స్టార్లు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరి పేర్లు ప్రస్తావించకుండా వీరు వున్నంతకాలం బాలీవుడ్ మునిగిపోతుందని అన్నాడు. ఈ కింగ్, బాద్షా మరియు సుల్తాన్లు బాలీవుడ్లో ఉన్నంత కాలం హిందీ సినిమా మునిగిపోతుంది. మీరు ప్రజల కథల సహాయంతో ప్రజల పరిశ్రమగా చేస్తే,
ఎఫ్ఎంసిజి సంస్ద డాబర్ ఇండియా లిమిటెడ్ తమ కంపెనీకి చెందిన నాలుగు బ్రాండ్లు 1,000 కోట్లకు పైగా టర్నోవర్ కలిగి ఉన్నాయని తన వార్షికనివేదికలో తెలిపింది. కంపెనీకి చెందిన రెండు బ్రాండ్లు-డాబర్ హనీ మరియు డాబర్ చ్యవన్‌ప్రాష్ - రూ. 500 కోట్లకు పైగా అమ్మకాలను కలిగి ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ. 100 కోట్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న 12 బ్రాండ్లు, రూ. 500 కోట్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న
భారతి ఎయిర్టెల్ టెక్ మేజర్ గూగుల్ కు ఒక్కో షేరుకు రూ.734 ఇష్యూ ధరతో 71 మిలియన్ షేర్లను కేటాయించేందుకు గురువారం ఆమోదం తెలిపింది. కంపెనీ మొత్తం పోస్ట్-ఇష్యూ ఈక్విటీ షేర్లలో గూగుల్ 1.2% కలిగి ఉంటుందని భారతి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపారు. జనవరిలో, భారతి ఎయిర్‌టెల్‌లో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ తెలిపింది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ సీజన్లో దేశ వ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం 17.4 శాతం తగ్గింది. పప్పుధాన్యాలు, ముతక తృణధాన్యాలు మరియు నూనె గింజల విస్తీర్ణం 7-9 శాతం ఎక్కువగా ఉంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు వరిసాగు 128.50 లక్షల హెక్టార్లకు (ఎల్‌హెచ్) చేరుకుంది. అంతకు ముందు సంవత్సరం ఇదే