Home /Author Guruvendhar Reddy
Satwik-Chirag back on circuit: గాయం కారణంగా ఆటకు దూరమైన భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి.. చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో తిరిగి రంగంలోకి దిగారు. సాత్విక్ భుజానికి గాయం కారణంగా పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఈ జోడీ ఆ తర్వాత జరిగిన ఆర్కిటిక్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, చైనా ఓపెన్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలకు దూరమైంది. కాగా, గాయం నుంచి సాత్విక్ కోలుకోవడంతో మంగళవారం వీరిద్దరూ చైనా […]
Israeli PM Netanyahu Confirms Hitting Iran Nuke Sites: గత కొన్ని నెలలుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. రెండు దేశాలూ తరచూ కవ్వింపు చర్యలతో బాటు దాడులకూ తెగబడుతున్న వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ మరోసారి ఇరాన్ మీద తమ వైఖరిని స్పష్టం చేశారు. తాజాగా, ఆయన ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడుతూ, ఆరునూరైనా ఇరాన్ ఒక అణుశక్తిగా అవతరించకుండా చూస్తామని ప్రకటించారు. లక్ష్యం టెహ్రాన్.. […]
Telangana BJP New President: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎన్నిక తర్వలో జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీలోని సీనియర్ నేతలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. గతంలో టీ బీజేపీ బాస్‌గా ఉన్న బండి సంజయ్‌ని తప్పించిన అధిష్ఠానం ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని కూర్చోబెట్టింది. తాజాగా, రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించాలని యోచిస్తున్న హస్తిన పెద్దలు పలు కోణాల్లో ఇక్కడి నేతల పేర్లను పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నలుగురు కీలక నేతలు ఈసారి బరిలో […]
Deputy CM Pawan Kalyan: మహిళలకు సంబంధించిన మిస్సింగ్ కేసులను ఛేదించిన విజయవాడ సిటీ పోలీసులకు మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్ అమలు చేస్తామని ముందే చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. ఆది నుంచే ఆగని పోరు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో 30 వేల మంది మహిళలు, బాలికలు అదృశ్యమైనా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఏపీ డిప్యూటీ సీఎం […]
CM Revanth Reddy landed in Warangal: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ చేరుకున్నారు. కుడా మైదానంలో హెలిప్యాడ్ ద్వారా ల్యాండ్ అయ్యారు. ఈ మేరకు ఆయనకు మంత్రులు స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి వర్గ బృందం ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ఛైతన్యపు రాజధాని. కాళోజీ నుంచి పీవీ వరకు మహనీయులను తీర్చిదిద్దిన నేల. […]
Deputy CM Pawan Kalyan in assembly sessions: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే ప్రభుత్వ ధ్యేయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శాసనమండలిలో గ్రామాల్లో డంపింగ్ యార్డులపై చర్చ జరిగింది. ఈ మేరకు మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానాలు చెప్పారు. గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు నిధులు ఇచ్చామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగానే 15వ ఫైనాన్స్ నిధులు సంపద సృష్టి కేంద్రాలకు కేటాయించామని […]
BRS EX MLA Patnam Narender Reddy: వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. చర్లపల్లి జైలులో నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించిన న్యాయస్థానం ఇంటి భోజనానికి అనుమతించింది. బీఆర్ఎస్ […]
Phone tapping case Petition in High Court by Shravan Kumar: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రావణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా, ఇప్పటికే నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రావణ్ కుమార్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో ఈ ముందస్తు బెయిల్ […]
Rishabh Pant disagrees with Sunil Gavaskar: భారత వికెట్ కీపర్, కీలక బ్యాటర్ రిషభ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసుకుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ రిటెన్షన్‌లో నలుగురి ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుంది. ఇందులో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పొరేల్, ట్రిస్టన్ స్టబ్స్‌లు ఉన్నాయి. అయితే అప్పటినుంచి ఢిల్లీ నుంచి రిషబ్ పంత్ ఎందుకు వైదొలిగాడనే విషయాలపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఓ ఇంటర్వ్యూలో […]
Ram Gopal Varma request to Message: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరుకాకుండా డుమ్మా కొట్టాడు. తనపై నమోదైన కేసులో ఇంకా నాలుగు రోజులు సమయం కావాలంటూ ఒంగోలు పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పంపించారు. అయితే ఇవాళ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆర్జీవీ విచారణకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల సమయంలో వ్యక్తిగత కారణాలతో విచారణకు రాలేనని మెసేజ్తలో పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబుతో పాటు పవన్ […]