Chhattisgarh: బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
![Chhattisgarh: బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/01/Encounter-in-Chhattisgarh-three-Naxalites-died.jpg)
Encounter in Chhattisgarh three Naxalites died: ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లాలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో మావోయిస్టులు, భద్రతా బలగాలు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తెలంగాణ సరిహద్దులో ఉన్న సౌత్ బీజా పూర్ జిల్లాలోని ఉసూర్ బాసగూడ, పమేడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూబింగ్ నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా మావోయిస్టులు ఎదురుపడగా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ కాల్పులు సుమారు గంటన్నర పాటు కొనసాగాయి. ఈ భీకర కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతం బీజాపూర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి సుమారు 130 కి.మీ దూరంలో ఉంది.ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.