Home /Author Guruvendhar Reddy
Hemant Soren To Take Oath As Chief Minister Of Jharkhand: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి ఘనవిజయం నేపథ్యంలో ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. నేడు రాష్ట్ర రాజధాని రాంచీలో జరిగే ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా ‘ఇండియా’ కూటమికి చెందిన అగ్రనేతలు ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రధాన […]
TS High Court Serious On Maganur ZP High School: నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా? అంటూ హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా సీరియస్ అంశమని సీజే ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా, ఫుడ్ పాయిజన్‌పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ […]
AP Dy CM Pawan Kalyan meets PM Narendra Modi in Delhi: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తిన పర్యటన మూడవ రోజూ బిజీబిజీగా సాగింది. తన పర్యటనలో భాగంగా ఆయన బుధవారం దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో ఏపీకి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు సహకరించాలని పవన్.. ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా […]
Bumrah back as No. 1 Test bowler: టెస్టు బౌలర్లలో బుమ్రా మళ్లీ అగ్రస్థానానికి చేరాడు. బుధవారం ప్రకటించిన ఐసీసీ ర్యాంకుల్లో బుమ్రా ఒకటో ర్యాంకులో నిలిచాడు. పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 295 పరుగుల తేడాతో భారత్ గెలవటంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా, ఆ మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టటమే గాక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ఐసీసీ పురుషుల టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో […]
Minister Tummala Nageswara Rao Clarity On Rythu runamaffi: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసింది. సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి మాఫీ కాలేదు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికీ రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. పాలమూరు సభ ద్వారా […]
Fly Ash Controversy cm chandrababu warning: రాష్ట్రంలో ఏ వ్యక్తులైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఫ్లై యాష్ అంశంలో సాగుతున్న వివాదంపై సీఎం ఆరా తీశారు. దీనిపై బుధవారం మీడియాతో సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని, ముఖ్యంగా కూటమి నేతలు ఈ విషయంలో మరింత […]
PM Modi Meets Party Leaders From Southern State: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో మోడీ సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని తన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సమావేశం ఫొటోలతో మోడీ ‘ఎక్స్’లో తెలుగులో పోస్టు పెట్టారు. […]
Ex Minister Harish Rao Sensational Comments On CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన విజయోత్సవాలపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను దగా చేసి పండుగ పేరిట విజయోత్సవాలా అని సీఎంను ప్రశ్నించారు. ఏడాది పాలనలో 563 మంది రైతులు ప్రాణాలు […]
Eknath Shinde clears way for BJP CM in Maharashtra: తనకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదని.. బీజేపీ ఆ పోస్ట్ తీసుకున్నా పర్వాలేదని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు. మహా ముఖ్యమంత్రి పదవి విషయంలో కాస్త ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. షిండే సైతం సీఎం పోస్టును ఆశిస్తున్నారని.. అందుకే పీఠముడి పడిందన్న వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు షిండే స్పందించారు. తనకు ఆ పదవి మీద ఇంట్రెస్ట్ […]
AP CM Chandrababu on the Paravada Pharmacity incident: అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి విషవాయువు లీకై కార్మికుడు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఠాగూర్ ల్యాబొరేటరీస్ కంపెనీలో మంగళవారం విషవాయువు లీకై 9 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒడిశాకు చెందిన కార్మికుడు అమిత్ (22) మృతి చెండాడు. మరొకరి పరిస్థితి […]