Home /Author Guruvendhar Reddy
India vs England 5th 20 match India thrashes England by 150 runs: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు 150 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆరంభం నుంచే చెలరేగారు. ఓపెనర్ సంజు శాంసన్(16) త్వరగా పెవిలియన్ చేరగా.. అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీ సృష్టించాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ […]
South Africa former Cricketer Jonty Rhodes visited BNI Vijayawada: దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ విజయవాడలో సందడి చేశారు. విజయవాడలో ఏపీ బీఎన్ఐ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా కాంక్లేవ్ 3.0 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, కోల్‌కతా నుంచి సుమారు 1500 మంది వ్యాపారవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రణాళికలు ఉండాలి.. ఏ రంగంలో అయినా రాణించాలంటే.. […]
JEE Main 2025 Exam Dates Released by NTA: దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీల్లో బీటెక్, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ -2 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షలను ఏప్రిల్ 1 నుంచి 8 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 25 రాత్రి 9 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. రాత్రి 11.50 గంటల వరకు ఫీజును స్వీకరిస్తామని సంస్థ ప్రకటించింది. పరీక్షను […]
Ponguleti Srinivasa Reddy says Panchayat Election Schedule Before 15th: త్వరలోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ నెల 15లోపు ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు కీలక ప్రకటన చేశారు. లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అర్హులకు అందజేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల లోపు అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. విపక్షాలు […]
Horoscope Today in Telugu February 03: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. పనులు శ్రమానాంతరం పూర్తవుతాయి. ఉన్నత హోదాల్లోని వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. వృషభం – రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థ […]
Weekly Horoscope: వార ఫలాలు. ఈ వారం ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 8 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషం: మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. సహోద్యోగులతో బంధువులతో విభేదాలు ఏర్పడి పరిస్థితి గోచరిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయం మీరు తీసుకుంటే పదిమంది దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. మీరు చెప్పే మాటలు ఎవరికీ రుచించవు. […]
Union Minister Nirmala Sitharaman 74 minutes Budget 2025 Speech: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. 2025-26 ఏడాదికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు 140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్ర పద్దును ప్రవేశపెట్టడం 8వ సారి. అయితే నిర్మలా సీతారామన్ మరో అరుదైన ఘనత సాధించింది. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. నిర్మలా సీతారామన్.. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో […]
Propose to introduce new Income Tax Slabsin Budget 2025: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మిడిల్ క్లాస్, మీడియం రేంజ్ ఎంప్లాయిస్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఇక ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదని ప్రకటించారు. ఈ మేరకు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ విధానంలో శ్లాబ్‌లను మార్చారు. అయితే దీనికి మరో రూ.75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే ఈ మొత్తం రూ.12,75,000 వరకు పెరుగుతుంది. […]
Nirmala Sitharaman reaches Parliament to present 8th consecutive Budget: 2025-26 కేంద్ర బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంట్ భవనంలో జరిగిన సమావేశంలో క్యాబినెట్ పద్దకు ఆమోదముద్ర వేసింది. అనంతరం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వరుసగా నిర్మలా సీతారామన్ 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. […]
India beat England by 15 runs in Fourth T20 Match: స్వదేశంలో ఇంగ్లాండ్‌తో భారత్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగానే పుణె వేదికగా కీలకమైన మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ బరిలో దిగిన […]