Home /Author Guruvendhar Reddy
Maharashtra Assembly Elections: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ)లతో కూడిన ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి ప్రయత్నిస్తోండగా.. బీజేపీ కూడా గెలిచేందుకు పక్కా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘సంకల్ప్ పత్ర’పేరుతో దీనిని విడుదల చేసి ప్రతిపక్ష […]
Bhogapuram Airport: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే భోగాపురం ఎయిర్ పోర్టు పనులను లక్ష్యం కంటే ముందుగానే 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెళ్లడించారు. దీనికి అనుగుణంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆదివారం 6వ సారి ఆయన భోగాపురం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు చేపడుతున్న జీఎంఆర్ ఇన్ ఫ్రా అధికారులతో పరిశీలించారు. […]
India vs South Africa 2nd T20: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది.చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్ డకౌట్ కాగా, అభిషేక్ శర్మ(4) పరుగులకే పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(4) పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా […]
Dy CM Pawan Kalyan: వచ్చే ఐదేళ్లలో అటవీ శాఖను బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. ఆదివారం గుంటూరు నగరపాలెంలో అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అటవీ శాఖలో అమరులైన సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అటవీ సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. భారతదేశం వసుదేక కుటుంబమన్నారు. ఈ భూమి మనుషులకే కాదు అన్ని ప్రాణులకు నివాసం అని తెలిపారు. అటవీశాఖలో తక్కువ […]
Central Home Minister Amit Shah in Jharkhand: ఝార్ఖండ్ ముక్తి మోర్చా సంకీర్ణ ప్రభుత్వం దేశంలోని అత్యంత అవినీమయ సర్కారుగా మారిందని, వారిని గద్దెదించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం ఝార్ఖండ్ లోని పాలము ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో చొరబాటుదారులను అరికట్టడం ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీతోనే సాధ్యమన్నారు. ఎన్ని తరాలు వచ్చి అడిగినా .. […]
India vs South Africa second t20 match: ఒకవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో కూడిన సీనియర్ జట్టు అటు వన్డే, ఇటు టెస్టు మ్యాచ్ ల్లో వరుసపెట్టి ఓడిపోతోంది. అయితే టీ 20ల్లో మాత్రం సూర్యకుమార్ కెప్టెన్సీలో దుమ్ము దుమారం రేపుతోంది. తాజాగా, దక్షిణాఫ్రికా తో జరిగే నాలుగు టీ 20ల్లో భాగంగా తొలి మ్యాచ్ లో భారత్ విజయపతాకం ఎగురవేసింది. ఇక ఆదివారం సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరగనున్న రెండో టీ […]
KCR Comments On Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో వందశాతం బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సిద్ధిపేటలోని పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులతో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వచ్చి నేటికీ 11 నెలలు పూర్తి కావొస్తుందని, ప్రజలు ఏం కోల్పోయారో ఇప్పటికే తెలుసొచ్చిందన్నారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. అంతకుముందు సినీ నిర్మాత […]
Chandra Babu Launch Sea Plane Services: మారుమూల ప్రాంతాలకు రవాణా సాధానాలను మెరుగు పరచడంతో పాటు రాష్ట్రంలో పర్యాటక ప్రగతికి తగిన చర్యలు చేపడతామని సీఎం నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సీప్లేన్ సర్వీసులతో ఆ లోటును భర్తీ కాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లతో కలిసి విజయవాడ -శ్రీశైలం సీప్లేన్ డెమో […]
AP Nominated Posts Second List Released: రాష్ట్రంలో సామాజిక, రాజకీయ న్యాయానికి సమతూకం కుదిరింది. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీడీపీ – జనసేన – బీజేపీ వివిధ నామినేటెడ్ పదువులను దక్కించుకున్నాయి. ఆయా పార్టీల ముఖ్య నాయకుల సమక్షంలో ఇది వరకే నిర్ణయించిన ధామాషా ప్రకారం కేటాయింపులు జరిగాయి. ఇందులో జనసేన దాదాపు 16శాతం దక్కించుకోవడం విశేషం. నామినేటెడ్ పదవుల భర్తీ ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. […]
US Presidential Election Results: అమెరికాలో అధ్యక్షఎన్నికలు ముగిశాయి. అంతా సర్దుకుంది. ఎవరికి వాళ్లు ప్రశాంతంగా తమ పనులు చేసుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అయితే జనవరిలో అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఇంకా రెండు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడలేదు. ఆరిజోనా, నెవడా రాష్ట్రాలు నేటికీ ఫలితాలు రావాల్సి ఉంది. ఎందుకలా? ఫలితాల ఆలస్యం పోస్టల్ బ్యాలెట్లే కారణమని పలువురు అంటున్నారు. అవి అందడానికి ఇంకా 10 రోజుల సమయం పడుతుందని […]