Home /Author Jyothi Gummadidala
చిరంజీవి ముఖ్య పాత్రలో నటించి గాడ్ ఫాదర్ చిత్రం ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా మెగాస్టార్ తన తమ్ముడు పవన్ కల్యాణ్ మరియు పవన్ నెలకొల్పిన జనసేన పార్టీ గురించి ప్రస్తావించారు. పవన్ వంటి నిబద్ధత ఉన్న నాయకుడు రాష్ట్రానికి కావాలని ఆయన తెలిపారు. ప్రజలు పవన్‌కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం ఇచ్చే రోజు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని చిరంజీవి చెప్పారు.
టీ20 ప్రపంచకప్‌కు దూరమవ్వడంపై జస్ప్రీత్ బుమ్రా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. మెగా టోర్నీ నుంచి తప్పుకోవడం పట్ల భావోద్వేగానికి గురయ్యాడు. తాను గాయం నుంచి కోలుకోవాలని కోరుకున్న పత్రీ ఒక్కరికి బుమ్రా ధన్యవాదాలు చెప్పారు. ఆస్ట్రేలియా వెళ్లి టీమిండియాకు మద్దతు తెలుపుతానంటూ ట్వీట్ చేశాడు.
ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్. అయితే ఈ చిత్రం నుంచి ఇటీవల టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే మరోవైపు ఈ టీజర్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆదిపురుష్ సినిమాను బాయ్ కాట్ చెయ్యాలంటూ ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లైన సెన్సెక్స్, నిఫ్టీలు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,180 పాయింట్లకుపైగా లాభాల్లో ఉండగా, నిఫ్టీ 360 పాయింట్ల వృద్ధితో ట్రేడవుతున్నది.
సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు ఉండవు అనే భ్రమలో చాలా మంది ఉంటారు. అయితే ఈ భ్రమ వట్టి అపోహ అని నిరూపించారు ఆ కలెక్టర్ దంపతులు. తన భార్య ప్రసవాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించి అసలైన ప్రభుత్వ అధికారి అనిపించుకున్నారు కలెక్టర్ భవేశ్ మిశ్రా. ఈ అరుదైన ఘటన తెలంగాణలోని ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.
ఓకే డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఓ మహిళా సీఐతో అదే కార్యాలయంలో పనిచేస్తున్న మరో ఇన్ స్పెక్టర్ అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. దీనిని గుర్తించి మహిళా సిఐ భర్త ఓ రోజు వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. కాగా వీరి తీరుపై సుబేదారి పోలీస్ స్టేషన్లో అతను ఫిర్యాదు చేశారు. ఈ ఇరువురి సీఐల వ్యవహారం వరంగల్ జిల్లాలో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
ప్రముఖ ఒడియా గాయకుడు మురళీ మోహపాత్ర ఇకలేరు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో దుర్గాపూజ మండపంలో సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన ఇస్తుండగా స్టేజిపైనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఏకంగా డీజీపీనే దుండగులు దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగక అతని శవాన్ని ఇంట్లోనే తగలబెట్టే ప్రయత్నం చేశారు.
తెలుగు సినీ చరిత్రకు ఆయన ఒక 'శంకరాభరణం'. 'స్వయం కృషి’ఎదిగి ‘సీతాకోక చిలుకలా తన అందమైన సినీరంగుల ప్రస్థానంతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతోమంది ‘సితార’లకు ఆయన సుపరిచితుడిగా ‘అపద్బాంధవుడ’య్యారు. తెలుగు సినిమాకు "పూర్ణోదయ" ద్వారా వెలుగులుగు నింపిన ది గ్రేట్ లెజెండరీ ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరరావుని ఓ సారి స్మరించుకుందాం.
ఈ రోజు అన్ని రాశులవారికి అనుకూల రోజుగా ఉంటుంది. వృశ్చిక, ధనస్సు రాశులవారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. అనుకోని రీతిలో లాభాలను పొందడం వల్ల ఆర్ధిక పరిస్థితులను చక్కదిద్దుకుంటారు. ఆరోగ్య సమస్యల పట్ల కాస్త జాగ్రత్తగా వహించండి.