Last Updated:

Adipurush: “బాయ్ కాట్” ఆదిపురుష్.. క్రాస్ బ్రీడ్ అంటూ విమర్శలు..!

ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్. అయితే ఈ చిత్రం నుంచి ఇటీవల టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే మరోవైపు ఈ టీజర్పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆదిపురుష్ సినిమాను బాయ్ కాట్ చెయ్యాలంటూ ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు.

Adipurush: “బాయ్ కాట్” ఆదిపురుష్.. క్రాస్ బ్రీడ్ అంటూ విమర్శలు..!

Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్. అయితే ఈ చిత్రం నుంచి ఇటీవల టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే మరోవైపు ఈ టీజర్పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఆదిపురుష్ సినిమాను బాయ్ కాట్ చెయ్యాలంటూ ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు.

ఎంతోమంది ప్రభాస్ ఫ్యాన్స్ టీజర్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తుంటే అదే సమయంలో మరికొందరు నెటిజన్లు ఈ టీజర్పై ప్రభాస్‌, ఓం రౌత్‌, మూవీ మేకర్స్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రభాస్ లుక్కు దగ్గర నుంచి మూవీలో యానిమేషన్ వరకూ అన్నింటిపైన ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రావణుడిగా సైఫ్ అలీఖాన్ లుక్‌ మీదైతే విపరీతమైన విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఓ నెటిజన్ అయితే సైఫ్ గెటప్ ను బ్రిటీష్ టీవీ షో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ షోతో పొల్చారు. అందులో రావణుడు ఓ రాక్షస పక్షి మీద వస్తున్న పిక్‌ని షేర్ చేసి ‘ఏంటి రావణుడు కూడా టార్గెరీయన్ హా’ అంటూ వెటకారంగా పోస్ట్ చేశారు. ‘రావణుడి కళ్లు వైట్‌వాకర్‌లా ఉన్నాయి’, ‘అది వైకింగ్‌కి టార్గెరీయన్‌కి పుట్టిన క్రాస్ బ్రీడ్.. లైగర్’ అంటూ విచిత్రమైన కామెంట్స్ రాసుకొచ్చారు.

బ్రాహ్మణుడైన రావణుడిని ఈ సినిమాలో దారుణంగా చూపించారని, సైఫ్ అలీ ఖాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ, బాబర్, ఔరంగజేబులా ఉన్నాడని మండిపడుతున్నారు. హనుమంతుడికి లెదర్ బట్టలు వెయ్యడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ హిందువులకు వ్యతిరేకంగా ఉందని ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని డైరెక్టర్కు కొంత మంది అభిమానులు లేఖ రాశారని మధ్యప్రదేశ్ మంత్రి మిశ్రా తెలిపారు.

ఇదీ చదవండి: బాలయ్య నయా లుక్.. విజయవాడలో “అన్ స్టాపబుల్” గ్రాండ్ ఈవెంట్

ఇవి కూడా చదవండి: