Home /Author Jyothi Gummadidala
ముంబై మహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చెంబూర్‌లో 12 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలోనే చాలామంది చిక్కుకుని ప్రాణాలను రక్షించుకునేందుకు చాలామంది కిటికీల నుంచి బయటకు రావడానికి ప్రయత్నించారు.
పంజాబ్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా ఎమ్మెల్యే తన పార్టీకే చెందిన కార్యకర్తను పెళ్లి చేసుకున్నారు. 28 ఏళ్ల ఎమ్మెల్యే నరిందర్ కౌర్ ఆప్ పార్టీ కార్యకర్త అయిన మణ్‌దీప్ సింగ్‌ను సెప్టెంబర్ 7,2022 శుక్రవారం నాడు చాలా సింపుల్ ఎటువంటి ఆర్భాటమూ లేకుండా వివాహం చేసుకున్నారు.
సినీ పరిశ్రమలో మరియు బుల్లితెర నాట ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సాధారణ విషయంగా మారిపోతుంది. కాగా ఇటీవల మరో నటి ఈ తరహా ఘటనతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. భర్త తనని మోసం చేశాడంటూ బుల్లితెర నటి దివ్వ శ్రీధర్ పోలీసులను ఆశ్రయించింది.
హిందూ దేవాలయాలపై గత కొన్ని రోజులుగా వివిధ దేశాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోని పురాతన హిందూ దేవాలయంపై కొందరు దుండగులు దాడి చేశారు. ఆలయంలోని దేవతా విగ్రహాన్ని ధ్వసం చేశారు. ఈ ఘటన ఇప్పుడు ఆ దేశమంతటా కలకలం సృష్టిస్తోంది.
టాలీవుడ్ నాట రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇది వరకే మహేశ్ బాబు 'పోకిరి', పవన్ కల్యాణ్ 'జల్సా', బాలకృష్ణ 'చెన్నకేశవ రెడ్డి' సినిమాలు రీరిలీజ్ అయ్యి మరోసారి ప్రేక్షకాదారణ పొందాయి. థియేటర్లలోనూ భారీగా కలెక్షన్లు సాధించి పెట్టాయి. అయితే తాజాగా ఈ లిస్టులోకి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ నటించిన 'రెబెల్' పదేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కాబోతుంది.
ప్రేమించమంటూ వెంటపడిన ఓ యువకుడు, తన ప్రేమను నిరాకరించిందని యువతిపై పగ పెంచుకుని ఆమెపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కూరాడలో చోటుచేసుకుంది.
సీమటపాకాయ్ ద్వారా టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ పూర్ణ. ఢీ ప్రోగ్రాం జడ్జిగా వ్యవహిరిస్తు మరింత ప్రేక్షకాదరణ పొందారు. ఇటీవలె ఈ ముద్దుగుమ్మ నిశ్చితార్ద వేడుక వైభవంగా జరిగింది. పలు ప్రోగ్రాంలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్న పూర్ణ.. ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో కెమెరాకు స్టిల్స్ ఇస్తూ దిగిన లేటెస్ట్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
బాధ్యతగత పదవిలో ఉండి బాధ్యత మరచి ప్రవర్తించాడు. సాయం చెయ్యాల్సింది పోయి నిర్దయగా వ్యవహరించాడు. దివ్యాంగుడని కూడా చూడకుండా అమానుషంగా అతనిపై దాడి చేశాడు ఓ కఠినాత్ముడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబ్ నగర్లో చోటుచేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో జంబ్లింగ్ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం పక్కపక్కన కూర్చునే అభ్యర్థులకు వేర్వేరు సెట్ల ప్రశ్నపత్రాలను అందజేయనున్నారు. కాగా ఈ ప్రశ్నాపత్రాల సెట్ల రూపకల్పనలో కూడా ఈసారి కొత్త విధానాన్ని అమలుచేయాలని కమిషన్ నిర్ణయించింది.
ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. విశాఖ కేంద్రంగా రాజకీయనేతలు వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నారు. కాగా తాజాగా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.