Home /Author Jyothi Gummadidala
భారత్ టెలికం మార్కెట్లో తక్కువ సమయంలోనూ ఎక్కువ మంది ఆదరణపొందిన జియో ఇప్పుడు 5జీలోనూ దూకుడు చూపిస్తోంది. ప్రస్తుతం జియో దేశంలోని నాలుగు సిటీల్లో ట్రయల్స్ కోసం 5జీ బీటా నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా 5జీ వినియోగదారులకు వెల్కమ్ ఆఫర్‌ను కూడా తీసుకొచ్చింది. వారికి అన్నీ ఉచితమంటూ ప్రకటించింది.
పుష్ప సినిమాకు సీక్వెల్ అయిన పుష్ప-2 చిత్రం ప్రస్తుతం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మోస్ట్ వెయిటెడ్ మూవీలో ఒక బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తున్నారంటూ వార్త వైరల్ అవుతుంది.
గాడ్ ఫాదర్ సినిమా హిట్ అయిన నేపథ్యంలో చిరంజీవిని ఉద్దేశించి సల్మాన్ ఖాన్ ఒక వీడియో సందేశాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఓ బ్యాంకులో సుమారు రూ.12.20 కోట్లకుపైగా నగదు చోరీకి గురయ్యింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని స్పెషల్ ఆపరేషన్ నిర్వహించగా విస్తుపోయే నిజం వెల్లడయ్యింది. ఆఖరికి దొంగని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ. 9కోట్లకు పైగా నగదును రికవరీ చేశారు. సీన్ కట్ చేస్తే ఆ దొంగ ఎవరో కాదు బ్యాంకు ఉద్యోగే. ఈ చోరీ ఘటన మహారాష్ట్ర థానేలోని మన్ వాడ ఏరియాలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో బ్యాంక్‌లో జరిగింది.
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ఆదరాభిమానాలను కైవసం చేసుకుంది. కాగా రామాయణం ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తున్నాడు. అందువల్ల ప్రభాస్ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన రావణదహనం కార్యక్రమంలో పాల్గొన్నాడు.
టాలీవుడ్ లో దిగ్గజ నిర్మాత అయిన రామానాయుడు మనవడు, సురేశ్ బాబు రెండో తనయుడు అయిన దగ్గుబాటి అభిరామ్ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘అహింస’. ఈ మూవీకి తేజ దర్శకత్వం వహిస్తుండగా తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను లాంఛ్ చేశారు మూవీ మేకర్స్. ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిరాం జంటగా గీతికా నటిస్తోంది.
ట్విట్టర్ కొనుగోలుపై ఎట్టకేలకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఓ దారికొచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ట్విట్టర్ షేరును 54.20 డాలర్ల చొప్పున 4,400 కోట్ల డాలర్లకు కొనేందుకు అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
దగ్గు, జలుబు సిరప్‌ల తీసుకోవడం వల్ల ఆప్రికాలోని 66 మంది చిన్నారులు చనిపోయారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్ అయ్యింది. ఆయా సిరప్లు ఉత్పత్తి చేసిన భారతీయ ఫార్మా సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ సిరప్ ప్రొడక్టులను ఉపయోగించవద్దని WHO ఇతర దేశాలకు సూచించింది.
కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో దాదాపు 9 మంది మృతి చెందగా మరో 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో నిర్వహించే దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు ముగిశాయి. ఈసారి కూడా దేవరగట్టు కర్రల సమరంలో రక్తం చిందింది. విజయదశమి సందర్భంగా ఊరేగే ఉత్సవ విగ్రహాల కోసం 10 గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకున్నారు.