Home /Author Jyothi Gummadidala
మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కీర్తి సురేష్. కాగా ఆమె ఇటీవలె చేసిన సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే తాను గ్లామర్ రోల్స్ చెయ్యడానికి రెడీ అంటూ తాజాగా సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ఆ ఫొటోస్ చూసిన అభిమానులంతా కీర్తి నయా లుక్ పై తెగ కామెంట్లు వేస్తున్నారు. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
కుక్కని పోలిన జంతువు నక్క. అయితే చిన్నపిల్లగా ఉన్నప్పుడు నక్క పిల్లకి, కుక్క పిల్లకి పెద్దగా తేడా తెలియదు. అలా ఓ ఫ్యామిలీ కుక్క అనుకుని పెంచుకున్నారు. తీరా చూస్తే అది నక్క అని తెలియడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా ఖంగుతినింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇలాంటి ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందామా..
ఈ మధ్యకాలంలో వాట్సాప్ తెలియని వారుండరనడంలో అతిశయోక్తి లేదు. ప్రతీ ఒక్క స్మార్ట్‌ఫోన్‌లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ అంతలా జీవితంలో భాగమైపోయింది. ఇలాంటి వాట్సాప్ మరో కొత్త అప్డేట్ ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది.
కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఉత్తర భారతాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తర్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దాదాపు 9 మంది మృతిచెందారు.
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని వణిస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి ఢిల్లీలోని ఓ భవనం కూలిపోయింది. లాహోరి గేట్ వద్ద ఉన్న ఓ బాహుళ అంతస్తుల భవనం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు అనగా వారంలోని మొదటి రోజు అయిన సోమవారం భారీగా పతనమయ్యాయి. స్టాక్స్ ప్రారంభంలోనే సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లకుపైగా నష్టపోగా, నిఫ్టీ కూడా 200 పాయింట్లు కోల్పోయింది.
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి పండుగలోగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బును అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
సినీ అవార్డుల కార్యక్రమాల్లో ఫిలింఫేర్ పురస్కారాలు చాలా ప్రత్యేకమైనవి. ఈవెంట్లో 2020,2021 సంవత్సరాలకుగాను ఫిలింఫేర్ అవార్డులకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించారు. కాగా సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రానికి అత్యధికంగా ఏడు అవార్డులు రావడం విశేషం.
ఇటీవలె కురుస్తున్న భారీ వర్షాల ధాటికి పలు దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. వరదలు వచ్చి నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. దీనితో నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. నైగర్ నదికి ఒక్కసారిగా వరద ప్రహవాం పోటెత్తడంతో బగ్‌బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయింది. దానితో 76 మంది నీటిలో మునిగి మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు.
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి కొన్ని దేశాలు అల్లాడుతున్నాయి. దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాను భారీవర్షాలు అతలాకుతలం చేశాయి. భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని కారకాస్‌కు సమీపంలోని లాస్ టెజెరస్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీనితో 22 మంది మృతి చెందగా మరో 52 మంది గల్లంతయ్యారు.