Last Updated:

67th Filmfare: ఫిలింఫేర్లో మెరిసిన “పుష్ప”.. “అల్లు” చిత్రాలకు అత్యధిక అవార్డులు

సినీ అవార్డుల కార్య‌క్ర‌మాల్లో ఫిలింఫేర్ పుర‌స్కారాలు చాలా ప్ర‌త్యేక‌మైనవి. ఈవెంట్‌లో 2020,2021 సంవ‌త్స‌రాల‌కుగాను ఫిలింఫేర్ అవార్డులకు ఎంపికైన వారి పేర్లు ప్ర‌క‌టించారు. కాగా సుకుమార్‌-అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పుష్ప‌ ది రైజ్ చిత్రానికి అత్య‌ధికంగా ఏడు అవార్డులు రావడం విశేషం.

67th Filmfare: ఫిలింఫేర్లో మెరిసిన “పుష్ప”.. “అల్లు” చిత్రాలకు అత్యధిక అవార్డులు

67th Filmfare: దక్షిణాది సినిమాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ మంచి ఖ్యాతిని గడిస్తున్నాయి. కాగా ప్ర‌తీ ఏడాది దేశంలోనే ప్రముఖ సినీ అవార్డుల ఉత్సవం అయిన ఫిలిం ఫేర్ అవార్డుల వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా జరిగింది. బెంగుళూరు వేదికగా ఆదివారం రాత్రి జరిగిన 67వ ఫిలిం ఫేర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నటీనటులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కాగా సినీ అవార్డుల కార్య‌క్ర‌మాల్లో ఫిలింఫేర్ పుర‌స్కారాలు చాలా ప్ర‌త్యేక‌మైనవి. ఈవెంట్‌లో 2020,2021 సంవ‌త్స‌రాల‌కుగాను ఫిలింఫేర్ అవార్డులకు ఎంపికైన వారి పేర్లు ప్ర‌క‌టించారు. కాగా సుకుమార్‌-అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పుష్ప‌ ది రైజ్ చిత్రానికి అత్య‌ధికంగా ఏడు అవార్డులు రావడం విశేషం. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ అల వైకుంఠ‌పురంలో చిత్రం మూడు విభాగాల్లో పుర‌స్కారాలకు సొంతం చేసుకుంది.

  • ఉత్తమ చిత్రం : పుష్ప: ది రైజ్
  • ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)
  • ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (పుష్ప: ది రైజ్)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్‌) : నాని (శ్యామ్ సింఘ‌ రాయ్)
  • ఉత్తమ నటి : సాయి పల్లవి (లవ్ స్టోరీ)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్ ఛాయిస్‌) : సాయి పల్లవి (శ్యామ్ సింఘ రాయ్)
  • ఉత్తమ సహాయ నటుడు : మురళీ శర్మ (అల వైకుంఠపురములో)
  • ఉత్తమ సహాయ నటి : టబు (అల వైకుంఠపురములో)
  • ఉత్తమ నటుడు (తొలి ప‌రిచ‌యం) : పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)
  • ఉత్తమ నటి (తొలి ప‌రిచ‌యం) : కృతి శెట్టి (ఉప్పెన)
  • ఉత్తమ మ్యూజిక్ ఆల్బ‌మ్‌ : దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప: ది రైజ్)
  • ఉత్తమ సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి (జాను)
  • ఉత్తమ గాయకుడు : సిద్ శ్రీరామ్ (పుష్ప: ది రైజ్)
  • ఉత్తమ గాయని : ఇంద్రావతి చౌహాన్ (పుష్ప: ది రైజ్)
  • ఉత్తమ కొరియోగ్రఫీ : శేఖర్ మాస్టర్ (అల వైకుంఠపురములో)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ : మిరోస్లా కుబా బ్రోజెక్ (పుష్ప: ది రైజ్)
  • లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు : అల్లు అరవింద్

ఇదీ చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ను బూతులు తిట్టిన మహిళ..!

ఇవి కూడా చదవండి: