Home /Author Jyothi Gummadidala
భారత పురుషుల జట్టు సాధించలేని విజయాన్ని మహిళల జట్టు కైవసం చేసుకుంది. మహిళల టీ20 ఆసియాకప్‌ను తన సొంతం చేసుకుంది హర్మన్ సేన. సిల్హౌట్ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ ఫైనల్లో మహిళల భారత జట్టు 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఈజీ విజయాన్ని నమోదు చేసింది.
ఓ టీచర్ చేసిన అనాలోచిత పని వల్ల ఓ విద్యార్థిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. పరీక్షల్లో కాపీయింగ్ చేస్తుందంటూ విద్యార్థిని అనుమానించిన టీచర్.. ఆ బాలికపై చేసిన పని ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. దీనితో ఒంటికి నిప్పంటించుకొని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్షెడ్పూర్లో జరిగింది.
Kantara: సినిమాను భాషతో సంబంధం లేకుండా సినీలవర్స్ ఆదరిస్తుంటారు. సినిమా బాగుంది అంటే చాలు ఏ భాష చిత్రాన్నైనా ఆదిరిస్తుంటారు తెలుగు ప్రజలు. కన్నడ చిత్రపరిశ్రమ నుండి విడుదలైన మరో చిత్రరాజం “కాంతార”. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థ అనువాదరూపంలో విడుదల చేసింది. కథేంటంటే.. భోగభాగ్యాలు ఉన్న ఓ రాజు ఏదో తెలియని లోటుతో మదనపడుతూండేవాడు. ఆయన ప్రశాంతతను వెతుక్కుంటూ పయనిస్తుండగా అడవిలో కనిపించిన ఓ […]
టర్కీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 25 మంది మృతిచెందగా, 110 మందికిపైగా కార్మికులు గాయపడ్డారు. మరో 50 మంది బొగ్గుగనిలోనే చిక్కుకుపోయారు.
గత కొద్దిరోజుల నుంచి తెలుగురాష్ట్రాల ప్రజలను ఎడతెరపిలేని వర్షాలు అల్లాడిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
హాలీవుడ్ ప్రముఖ నటుడు రాబీ కోల్ట్రేన్ కన్నుమూశారు. హ్యారీపోటర్ సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికీ రాబీ కోల్ట్రేన్ సుపరిచితుడే. ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలైన హ్యారీపోటర్ సిరీస్‌లో రాబీ కోల్ట్రేన్ హాగ్రిడ్ అనే ముఖ్య పాత్ర పోషించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
రోజురోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులపై మృగాళ్ల విరుచుకుపడుతున్నారు. ఎన్ని చట్టాలు చేసినా ఈ కామాంధులు అరాచకాలకు అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో ఓ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ కలకలం రేపుతుంది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు రాజకీయ సంబంధ వ్యవహారాల్లో పాల్గొనకూడదన్న నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ మీటింగ్‌లో పాల్గొన్నారంటూ తమిళిసై పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మునుగోడు ఉపఎన్నిక ముందు తెరాస ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు కేసీఆర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ పార్టీలో తనను అవమానించారని, వ్యక్తిగతంగా చాలా బాధపడ్డానంటూ బూర నర్సయ్య గౌడ్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ రాజకీయాలు విశాఖ కేంద్రంగా ఉట్టుడుకుతున్నాయి. ఓ వైపు అధికార వైసీపీ విశాఖ గర్జన ర్యాలీ నిర్వహిస్తుండగా మరోవైపు నేడు జనసేనాని విశాఖలో పర్యటించనున్నారు.