Home /Author Jyothi Gummadidala
వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని అంటూ నేడు విశాఖ గర్జన కార్యక్రమానికి జేఏసీ శ్రీకారం చుట్టింది. మన విశాఖ-మన రాజధాని నినాదంతో అధికార వైసీపీ ఈ ర్యాలీని తలపెట్టింది. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వికేంద్రీకరణకు మద్దతుగా లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొననున్నారు.
భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) కేంద్ర ప్రభుత్వం తీరుతో ఇప్పటికే దాదాపు రూ. 200 కోట్లు నష్టపోయింది. కాగా ఇప్పుడు బీసీసీఐకి మరోసారి రూ.955 కోట్ల నష్టం వాటిల్లనుంది.
దేశంలోని ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగ కర్వాచౌత్. కాగా ఈ పర్వదినం సందర్భంగా బాలీవుడ్లో పలు కొత్త జంటలు సందడి చేశాయి. భర్త క్షేమం కోరుతూ మహిళలు ఈ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ.
తెలంగాణలో మునుగోడు ఉపఎన్నికల వేడి కొనసాగుతుంది. కారు-కమలానికి మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలో మరోమారు బీజేపీకి వ్యతిరేకంగా అంటించి ఉన్న పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.
మహిళల ఆసియాకప్ తుది దశకు చేరుకుంది. మంచి ఫామ్‌లో ఉన్న హర్మన్‌ప్రీత్ సేన నేడు లంక జట్టుతో ఫైనల్ మ్యాచ్ తలపడనుంది. కాగా ఈ టోర్నీలో మిగిలిన ఈ ఏకైక మ్యాచ్‌లోనూ భారత్ తమ ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటోంది.
సాధారణంగా ఏటీఎంలను మనీ విత్ డ్రా చేసేందుకే ఉపయోగిస్తాం కదా అయితే తాజాగా వేడి వేడి ఇడ్లీలు అందించే ఏటీఎంలు కూడా అందుబాటులోకి వచ్చాయండోయ్. ఇదిక్కడా అలా ఎలా వేడివేడి ఇడ్లీలు వస్తున్నాయా అనుకుంటున్నారా.. కర్ణాటక రాజధానిలో ఒక స్టార్టప్ కంపెనీ ఈ‘ఇడ్లీ ఏటీఎం’లను అందుబాటులోకి తెచ్చింది. మరి దాని విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
చార్జర్ లేకుండా ఐఫోన్లను విక్రయిస్తున్నందుకు యాపిల్‌కు సంస్థకు బ్రెజిల్ కోర్టు మరోసారి భారీ జరిమానా విధించింది. రూ 150 కోట్లు ఫైన్ చెల్లించాలని, రిటైల్ బాక్స్‌లో విధిగా చార్జర్‌ను జోడించాలని యాపిల్ సంస్థను బ్రెజిల్ కోర్టు ఆదేశించింది.
కర్వా చౌత్.. ఈ పండుగను ఉత్తర, ఈశాన్య భారతంలోని రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. తమ భర్త ఆరోగ్యంగా ఉండాలని మహిళలు ఈ రోజు ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాంటి పండుగ రోజున ప్రేయసితో భర్తతో షాపింగ్ వెళ్లి భార్యకు అడ్డంగా బుక్కయ్యాడు. దానితో ఆమె అక్కడే తనను చితకబాదింది. ఇందుకు సంబంధించిన ఇప్పుడు ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ యూజర్లకు శుభవార్త. ఇకపై మీ గూగుల్ అకౌంట్లను పాస్వర్డ్ లేకుండానే లాగిన్ అవ్వొచ్చు. గూగుల్ యూజర్లకు అదనపు సెక్యూరిటీ అందించేందుకు ఆండ్రాయిడ్ డివైజ్‌లు క్రోమ్ కోసం కొత్త పాస్కీ అనే ఫీచర్‌ను రిలీజ్ చేసింది.
త్రివిక్రమ్ సినిమాలో మహేష్‌బాబు కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం కోసం మహేష్ బాబు మేకోవర్ అవుతున్న ఫొటోను స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.