Home /Author Jaya Kumar
తెలుగు చిత్ర పరిశ్రమను వరుస విషాదలు వెంటాడుతున్నాయి.కృష్ణం రాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతి రావు, సీనియర్ నటి జమున, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి ఇటీవల మృతి చెందారు.కాగా ఇప్పుడు తాజాగా పరిశ్రమలో మరో మరణ వార్త అందరిలో విషాదం నింపింది.ప్రముఖ తెలుగు దర్శకుడు ‘విద్యాసాగర్ రెడ్డి’ నేడు కన్ను మూశారు.
పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల మండలం అలవాలలో ఈ ఘటన జరిగింది. టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ అయిన బాలకోటిరెడ్డి ఇంట్లోకి అర్ధరాత్రి సమయంలో ప్రవేశించిన దుండగులు ఆయనపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డిని కుటుంబ సభ్యులు వెంటనే నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
న్యూజిలాండ్తో సొంత గడ్డపై జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ను భారత్ చేజిక్కించుకుంది. ఇటీవల జరిగిన వన్డే సిరీస్ను కూడా 3-0 తేడాతో ఇండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక టీ20 సిరీస్ను కూడా 2-1 తేడాతో కివీస్ ని మట్టికరిపించి దక్కించుకుంది.
Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి ఆస్తి విషయంలో ఉన్న సమస్య పరిష్కారం అవుతుందని తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 2వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
'దళపతి 67'లో విజయ్, త్రిష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ్ లో వీరిద్దరిది సూపర్ హిట్ జోడీ. చాలా సినిమాల్లో ఈ జోడి కలిసి నటించింది ప్రేక్షకుల మెప్పు పొందింది.
జనసేన అధినేత గేర్ మార్చి సినిమాలు, రాజకీయాలలో స్పీడ్ పెంచారని తెలుస్తుంది. ఒకవైపు వరుస సినిమాలు స్టార్ట్ చేస్తూ దూకుడు పెంచిన పవన్ మరో వైపు రాజకీయాలలో కూడా అధికార పార్టీ నేతలపై పంచ్ ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ వైసీపీపై నిప్పులు చెరిగారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్స్ చేసి తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు గుప్పించారు. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాధ్ పై ఫైర్ అయ్యారు
పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన ఒక మూవీలో నటిస్తుంది. చివరగా ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో నటించగా .. ఆ మూవీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 2023 - 24 కేంద్ర బడ్జెట్ ను ఆమె సమర్పించారు. ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్ ఐదోసారి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇక్కడ విశేషం. ప్రతీసారి లాగే ఈసారి కూడా నిర్మల సీతారామన్ వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. సంప్రదాయ చీరకట్టులో ఆమె పార్లమెంటుకు హాజరయ్యారు.
కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రకటించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో గంటన్నర పాటు బడ్జెట్ ప్రసంగం వినిపించారు.
ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే.