Home /Author anantharao b
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ్టి నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయన మూడు దఫాలుగా పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. నాలుగో విడత పాదయాత్రకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
తెలంగాణ పై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. హైదరాబాద్ సహా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్, 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. ఐదురోజుల విరామం తర్వాత ఇవాళ తిరిగి ఉభయసభలు ప్రారంభం అయ్యాయి. ముందుగా దివంగత మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు మృతికి సభలో సంతాపం తెలిపారు.
తన ఇద్దరు కూతుళ్లు పెళ్లి కాకుండానే గర్భవతులయ్యారని తెలిసి ఒక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరు కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు వేర్వేరు కాలేజీల్లో ఒకరు డిగ్రీ, మరొకరు ఇంటర్ చదువుకుంటున్నారు. వీరి తండ్రి లారీడ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే సడన్ గా కుమార్తెలిద్దరికీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఓనం పండుగకు ముందు వారంలో కేరళీయులు రూ. 624 కోట్ల విలువైన ఆల్కహాల్‌ను తాగేసారు. దీనితో రాష్ట్రంలో అత్యధిక మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. 2021లో రూ.529 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది.
దుబాయ్ అన్ని విలాసవంతమైన వస్తువులకు అంతిమ గమ్యస్థానంగా ఉంది. జత్వరలో ఇక్కడ ఒక భారీ చంద్రుని ఆకారపు రిసార్ట్ దాని వైభోగాన్ని మరింత పెంచుతుంది.
బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మరణంతో ఆ దేశ ప్రజల్లో కొత్త అనుమానం పుట్టుకొచ్చింది. తమ పాస్‌పోర్టులు అంతర్జాతీయంగా చెల్లుబాటు అవుతాయా? అంటూ సోషల్ మీడియా వేదికగా వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే.. యూకే పాస్‌పోర్టుల మొదటి పేజీపై ‘‘శ్రీమత్ మహారాణికి చెందిన విదేశాంగ మంత్రిగా ఇందుమూలముగా సంబంధిత వ్యక్తులకు విజ్ఞప్తి చేయునది ఏమనగా.. ఎవరైతే దీన్ని (పాస్‌పోర్టు) కలిగి ఉన్నారో ఆ వ్యక్తి ఎటువంటి అడ్డంకులు లేకుండా, స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా... ఆ వ్యక్తికి అవసరమైన మేర సాయాన్ని, భద్రతను కల్పించాలి’’అని రాసి ఉంటుంది.
హైదరాబాద్‌లో అదృశ్యమైన యువతి సాయిప్రియ కథ విషాదాంతమైంది. నాలుగు రోజుల క్రితం సాయిప్రియ హైదరాబాద్ నుంచి అదృశ్యమై.. వనపర్తిలో శవమై కనిపించింది. ఆమెను ప్రియుడే దారుణంగా హతమార్చాడు. సాయిప్రియను హత్య చేసి వనపర్తి సమీపంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు శ్రీశైలం. గతంలో సాయి ప్రియ, శ్రీశైలం ప్రేమించుకున్నారు. అయితే విషయం ఇంట్లో తెలియడంతో సాయిప్రియ తల్లి దండ్రులు వారించారు. దీంతో సాయి ప్రియ అతనికి దూరంగా ఉంటూ వచ్చింది.
అరుణాచల్ ప్రదేశ్ లోని కిబితు సైనికశిబిరానికి భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, దివంగత జనరల్ బిపిన్ రావత్ మిలటరీ గారిసన్ గా పేరు పెట్టారు. శనివారం జరిగిన కార్యక్రమంలో, స్థానిక సాంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించిన గ్రాండ్ గేట్ ను ఆవిష్కరించారు. వాలాంగ్ నుండి కిబితు వరకు 22 కి.మీ పొడవైన రహదారిని అరుణాచల్ ప్రదేశ్ సిఎం పెమా ఖండూ 'జనరల్ బిపిన్ రావత్ మార్గ్'గా అంకితం చేశారు.
పరీక్ష కోసం ఓ యువతి ప్రాణాలకు తెగించి చేసిన సాహనంపై నెటిజన్లు శభాష్ అంటున్నారు. పరీక్షకు హాజరయ్యేందుకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటింది. యువతి సంకల్పానికి ఆమె సోదరులు తోడవడంతో ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని దాడి ఆమె పరీక్షకు బయలుదేరింది.