Home /Author anantharao b
చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ సాక్షిగా పటాన్చెరు టీఆర్ఎస్ రాజకీయం రసకందాయంలో పడింది. చిట్కుల్లో జరిగిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు హజరు కాకపోవడం టీఆర్ఎస్లో గ్రూప్ విభేదాలను మరోసారి బట్టబయలు చేసింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల టూర్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనకు, తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని తిరుమల శ్రీవారి పై ప్రమాణం చేయాలన్నారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించే విధంగా ఓ ట్వీట్ చేశారు
ప్రముఖ నటి ఆశా పరేఖ్‌ను 2020 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా ఎంపికచేసినట్లు సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దళిత బంధు మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ లో బతుకమ్మ చీరల పంపిణీ చేసేందుకు వెళ్లారు. అక్కడ దళిత బంధు గురించి ప్రశ్నించిన మహిళల పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
షర్మిల హద్దుల్లో ఉండాలి. వైయస్ పరువు తీయొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. నన్ను వ్యభిచారి అంటావా? అంటూ అంటూ షర్మిల పై మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను వ్యభిచారి అంటే ఏమీ కాదని, కానీ అదే మాట తానంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు విధేయులైన 90 మందికి పైగా రాజస్థాన్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ అధ్యక్షపదవిరేసునుంచి అశోక్ గెహ్లాట్ తొలగించబడ్డారు.
ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) సంస్థ పై రెండవ రౌండ్ దేశవ్యాప్త దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 247 మందిని అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, అస్సాం, ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్ఐఎ సోదాలు జరుగుతున్నాయి.
మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దసరా ఉత్సవాల్లో హింసకు పీఎఫ్ఐ భారీ కుట్ర చేసినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. నాగపూర్ అర్ ఎస్ ఎస్ కార్యాలయం వద్ద పీఎఫ్ఐ నేతలు రెక్కీ నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శన వేళల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది. నేటి నుంచి అక్టోబర్ 5 వరకూ శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు అన్నింటినీ టీటీడీ రద్దు చేసింది.