Home /Author anantharao b
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై నేడు ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. వీరితో పాటు ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు, ఇతర కీలక శాఖల కూడా హాజరుకానున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్‌ఫాదర్‌లో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కీలక పాత్ర పోషించారు. మొదట్లో దీన్ని చేయడానికి ఇష్టపడకపోయినా చిరు కోసమే చేశారు. తన ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో, ఈ సినిమాలో నటించడానికి పూరి విముఖత చూపాడంటూ చిరు చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి చిత్రం గాడ్ ఫాదర్ పై అటు పరిశ్రమ, ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి కూడ ఈ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రం మలయాళ చిత్రం లూసిఫర్‌కి రీమేక్ అయినప్పటికీ చిత్రం యొక్క నాన్-థియేట్రికల్ హక్కులు రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి.
మాజీ సీఎం, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ మంత్రి దాడిశెట్టి రాజాపై మాజీ మంత్రి కేఎస్ జవహర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వీటికోసం ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని విద్యార్థులను కోరారు. సోమవారం రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు.
ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జియార్జియా మెలోని బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. నేషనలిస్ట్ బ్రదర్స్ పార్టీ నేత అయిన మెలోని, ఆదివారం జరిగిన జాతీయ ఎన్నికల్లో ఆధిక్యాన్ని సాధించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ విషయాన్ని వెల్లడించాయి.
సెంట్రల్ రష్యాలోని ఓ పాఠశాలపై సోమవారం ఉదయం ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు విద్యార్థులు సహా మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని ఉద్ముర్తియా ప్రాంత గవర్నర్ అలెగ్జాండర్ బ్రెచాలోవ్ ఓ వీడియో ద్వారా ప్రకటించారు
ఉక్రెయిన్‌తో యుద్ధంలో కొన్నాళ్లుగా రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మెరుపు దాడులతో ఉక్రెయిన్ దళాలు మాస్కో సేనలను భారీగా దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీలో వివాదం రేగుతున్న సమయంలో మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు
రూ.21,000 కోట్ల రూపాయల మేరకు వస్తు సేవల పన్ను (జిఎస్టి) చెల్లించనందుకు బెంగళూరుకు చెందిన ఆన్లైన్ గేమింగ్ సంస్థ గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (జిటిపిఎల్)కి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) షోకాజ్ నోటీసు జారీ చేసింది.