Home /Author anantharao b
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్)ను నియమించాలని కేంద్రం నిర్ణయించింది. డిసెంబరు 8, 2021న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జనరల్ బిపిన్ రావత్ తర్వాత ఈ పదవిని చేపట్టిన రెండవ వ్యక్తి ఆయన.
రైతు మోటార్లకు మీటర్లు బిగిస్తే బిగించేవాడి చేతులు నరకుతామంటూ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో రైతు సదస్సులో పాల్గొన్న ఆయన రాజన్న పాలన తెస్తానని రాజన్న మాటకి సీఎం జగన్ పంగ నామాలు పెట్టారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలోని 416 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా క్లినిక్ లు, ఆస్పత్రులను తనిఖీలు చేస్తున్నామన్నారు.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, వదంతులను నమ్మవద్దని కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ అన్నారు. బుధవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ కూడా పూర్తైందని ఆయన చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో ఆవుల ఆక్రమరవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే డియర్నెస్ అలవెన్స్ (డీఏ) మరియు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్)లో 4 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PM-GKAY) పథకాన్ని డిసెంబర్ 2022 వరకు మూడు నెలల పాటు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇండో స్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రుని అరెస్ట్ చేసింది. రాజేంద్ర ప్లేస్‌లోని యూకో బ్యాంకు ఖాతాకు కోటి రూపాయలు బదిలీ చేసినట్లు మహేంద్రుపై ఆరోపణలు వచ్చాయి
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధించిందన్న వార్తల నేపథ్యంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ట్విట్టర్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పై విరుచుకుపడ్డారు.
జాతీయపార్టీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ వేగంగా అడుగులేస్తున్నారు. దసరా రోజున టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలోనే జాతీయ పార్టీ ప్రకటన పై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది.