Home /Author anantharao b
అరుణాచల్ ప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాలు చట్టాన్ని శనివారం నుంచి ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన ఖర్గే తన రాజీనామాను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు.
ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా నగరంలో శుక్రవారం పౌర కాన్వాయ్‌పై రష్యా క్షిపణి దాడి చేయడంతో కనీసం 30 మంది మరణించగా 88 మంది గాయపడ్డారు.
కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కేసీఆర్ ను తిడతారు. మరలా ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ పధకాలు బాగున్నాయిని అవార్డులు ఇస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు.
ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని విజయవాడ ఫ్యామిలీకోర్టు ఆదేశించింది.
ఏపీలో ‘ నేటినుంచి వైఎస్ఆర్ కళ్యాణమస్తు’, ‘షాదీ తోఫా’ పథకాలు అమల్లోకి రానున్నాయి. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ తోఫా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. బాల్యవివాహాలను నివారించడం డ్రాపౌట్ రేట్‌ను గణనీయంగా తగ్గించడం లక్ష్యాలుగా వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
నటి రేణు దేశాయ్ రెండు దశాబ్దాల తర్వాత మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' ద్వారా పెద్ద తెరపైకి వస్తున్నారు. రేణు దేశాయ్ పాత్రను పరిచయం చేయడానికి మేకర్స్ గురువారం ఒక చిన్న టీజర్‌తో ముందుకు వచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం వచ్చే వారం విడుదలకానుంది. ఇది కాకుండా చిరు వాల్తేర్ వీరయ్య మరియు భోళా శంకర్ల సినిమాలు కూడ షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్రకు రెడీ అయ్యారు. నాలుగు పాదయాత్రలకు భిన్నంగా ఈసారి, నిత్యం రెండు వర్గాల మధ్య అలర్లు జరిగే ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభించడం ఉత్కంఠ రేపుతోంది.
వైసీపీ ఫైర్ బ్రాండ్‌కు ఏమైంది? కొడాలి నాని ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారు? జగన్ సర్కార్ నిర్ణయాల పై కొడాలి నాని అసంతృప్తితో ఉన్నారా? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టినా, అన్నగారి వీరాభిమాని ఎందుకు స్పందించడం లేదు.