Home /Author anantharao b
సెలబ్రిటీలు లేదా ప్రముఖ వ్యక్తులు రోడ్డు ట్రాఫిక్‌ను నివారించడానికి ఆటోలో ప్రయాణించడం అసాధారణం కాదు. గతంలో సెలబ్రిటీలు ఆటో రిక్షాల్లో ప్రయాణించిన సందర్భాలు ఎన్నో చూశాం. మెర్సిడెస్-బెంజ్ ఇండియా సీఈవో మార్టిన్ ష్వెంక్ పూణేలో ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దీనితో అతను ఆటో ఎక్కాల్సి వచ్చింది.
అసలైన ఔషధ ఉత్పత్తులను కనుగొనడంలో మరియు ట్రేస్ చేయడంలో సహాయపడటానికి, ఔషధాల ప్యాకెట్లపై బార్ కోడ్లు లేదా క్యూఆర్ కోడ్లను ప్రింట్ చేయమని లేదా అతికించమని కేంద్రం త్వరలో ఔషధ తయారీదారులను కోరవచ్చని తెలుస్తోంది.
చాలాకాలం తరువాత దర్శకుడు మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్ ధియేటర్లలో విడుదలయింది. ఐశ్వర్యరాయ్, శరత్ కుమార్, త్రిష, విక్రమ్, కార్తీ తదితరులు నటించిన ఈ చారిత్రక సినిమాలో స్టార్స్ ధరించిన బంగారు అభరణాలను హైదరాబాద్ కు చెందిన కిషన్ దాస్ జ్యూవెలర్స్ తయారు చేసింది.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తన క్యాబిన్ సిబ్బందిని అండర్ వేర్లు ధరించాలని' కోరుతూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఎయిర్‌లైన్స్ ఎయిర్ హోస్టెస్‌ల డ్రెస్సింగ్ పై పాకిస్థాన్ జాతీయ క్యారియర్ ఫ్లైట్ జనరల్ మేనేజర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారని, ఆ తర్వాత మార్గదర్శకాలు జారీ చేశారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది.
కాబూల్‌లోని ఒక విద్యా కేంద్రంలో ఆత్మాహుతి బాంబు దాడిలో మృతుల సంఖ్య 100 కు చేరింది. స్థానిక జర్నలిస్టు చెప్పిన వివరాల ప్రకారం, ఈ సంఘటనలో విద్యార్థులు ఎక్కువగా హజారాలు మరియు షియాలు మరణించారు.
ఆస్ట్రేలియాలో జరిగే ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్ 2022లో విజేతకు $1.6 మిలియన్లు లేదా రూ. 13 కోట్ల చెక్కు ప్రైజ్ మనీగా దక్కుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ఐసిసి ) ఈ రోజు ప్రకటించింది.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి సీనియన్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే. శశిథరూర్‌లు మాత్రమే ఒకరితో ఒకరు తలపడుతున్నారు.
అమెరికాలో ఉంటూ ఏళ్ల తరబడి గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న 80 లక్షల మందికి శుభవార్త. వీరికి శాశ్వత నివాస హోదా కల్పించే కార్డును మంజూరు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నలుగురు సభ్యుల బృందం సెనేట్‌లో ప్రవేశపెట్టింది.
ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద జరిగిన పేలుడులో 19 మంది దుర్మరణం పాలయ్యారు.
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో 58.07% మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్ ప్రకటించారు.