Home /Author anantharao b
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నారా లోకేష్ ను నియమించాల్సిన సమయం వచ్చిందని టీడీపీ కి చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు . ఈ ఎన్నికల్లో 130 స్థానాలు కూటమిగెలుచుకుని చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు .
జీహెచ్ఎంసీ లో మహిళా కార్మికులపై అకృత్యాలకు పాల్పడిన గాజులరామారం సర్కిల్ లోని శానిటేషన్ ఫీల్ట్ అసిస్టెంట్ కిషన్ ను డిస్మిస్ చేసారు . అతను చేసిన కీచకపర్వం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తీవ్రంగా పరిగణించి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసారు
: ఏపీలో ఈ నెల 13న ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే ,తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కి హై కోర్ట్ లో ఊరట లభించింది .
భద్రాచలం మారుతి పారా మెడికల్ నర్సింగ్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. నర్సింగ్ విద్యార్థిని కారుణ్య అనుమానాస్పద మృతికి నిరసనగా.. విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నిన్న హాస్టల్ బాత్రూమ్లో తీవ్ర గాయాలతో పడి ఉన్న కారుణ్యను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారి గుట్టు రట్టైంది. కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డ సబిత్ నాసిర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు దళారులు ఈ రాకెట్‌ను నడిపించారని.. అందులో ఒక వైద్యుడు ఉన్నాడని తేలింది.
ఇండియాలో లీడింగ్ ఎయిర్‌లైన్ ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసిక ఫలితాలను గురువారం నాడు వెల్లడించింది. ఏడాది ప్రాతిపదికన చూస్తే కంపెనీ ఏకీకృత నికరలాభం106 శాతం పెరిగి రూ.1,895కోట్లకు ఎగబాకింది.
తాను అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తలపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. తనకి ఎలాంటి అనారోగ్యం లేదని తెలిపారు. తన ఇంట్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న వీడియోను ఆయన షేర్ చేశారు. కాగా.. నాని తన ఇంట్లో అస్వస్థతకు గురయ్యారని.. ఆయనను ఆసుపత్రికి తరలించారని ఉదయం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
చత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలకు.. నక్సలైట్లకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు మృతి చెందారు. నారాయణపూర్ -బీజూపూర్ జిల్లాల సరిహద్దులో గల అటవీ ప్రాంతంలో గురువారం నాడు భద్రతా దళాలకు .. నక్సలైట్లకు మధ్య ఎదుర కాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందారని పోలీసులు తెలిపారు.
దేశీయ స్థాక్ మార్కెట్ దూసుకుపోయింది. స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగియడంతో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్టాలను నమోదు చేసింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు..ఆర్బీఐ డివిడెండ్, ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో ఒక్కసారిగా భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. నటి హేమకు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తెలుగు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నటి హేమ, అషీరాయ్, వాసుకు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.