Last Updated:

Kodali Nani: తన అస్వస్థత వార్తలపై స్పందించిన కొడాలి నాని

తాను అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తలపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. తనకి ఎలాంటి అనారోగ్యం లేదని తెలిపారు. తన ఇంట్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న వీడియోను ఆయన షేర్ చేశారు. కాగా.. నాని తన ఇంట్లో అస్వస్థతకు గురయ్యారని.. ఆయనను ఆసుపత్రికి తరలించారని ఉదయం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Kodali Nani: తన అస్వస్థత వార్తలపై స్పందించిన కొడాలి  నాని

 Kodali Nani: తాను అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తలపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. తనకి ఎలాంటి అనారోగ్యం లేదని తెలిపారు. తన ఇంట్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న వీడియోను ఆయన షేర్ చేశారు. కాగా.. నాని తన ఇంట్లో అస్వస్థతకు గురయ్యారని.. ఆయనను ఆసుపత్రికి తరలించారని ఉదయం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

గురువారం ఉదయం తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి నాని కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడ వున్న నేతలు, గన్‌మెన్లు డాక్టర్లకు సమాచారం అందించారు. డాక్టర్లు వచ్చిన వెంటనే ఇంట్లో ఉన్న కార్యకర్తలు, నేతలను గన్‌మెన్లు బయటికి పంపించేశారు. ప్రధమ చికిత్స చేసిన అనంతరం కొడాలి నానికి.. వైద్యులు సెలైన్లు ఎక్కించారు . ఈ ఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. కొడాలి నాని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో వున్నారని , విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి హుటాహుటిన గుడివాడకు వచ్చినట్లు తెలుస్తోంది .

అభిమానుల్లో ఆందోళన..( Kodali Nani)

నానికి అస్వస్థత ఏర్పడిన సంగతి సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరగడంతో నాని ఆభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఆందోళన చెందారు . అసలేం జరుగుతోందో తెలియక నాని ఇంటికి చాల మంది కార్యకర్తలు చేరుకున్నారు .అయితే తాజాగా నాని విడుదలచేసిన ఫొటోలో దర్జాగా ,కులాసాగా ఉన్నట్లు తెలుస్తోంది .