Last Updated:

Bhadrachalam: భద్రాచలంలో నర్సింగ్ విద్యార్థిని మృతి.. కళాశాల వద్ద విద్యార్థి సంఘాలు, బంధువుల ఆందోళన

భద్రాచలం మారుతి పారా మెడికల్ నర్సింగ్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. నర్సింగ్ విద్యార్థిని కారుణ్య అనుమానాస్పద మృతికి నిరసనగా.. విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నిన్న హాస్టల్ బాత్‌రూమ్‌లో తీవ్ర గాయాలతో పడి ఉన్న కారుణ్యను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

Bhadrachalam: భద్రాచలంలో నర్సింగ్  విద్యార్థిని మృతి.. కళాశాల వద్ద  విద్యార్థి సంఘాలు, బంధువుల ఆందోళన

Bhadrachalam: భద్రాచలం మారుతి పారా మెడికల్ నర్సింగ్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. నర్సింగ్ విద్యార్థిని కారుణ్య అనుమానాస్పద మృతికి నిరసనగా.. విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నిన్న హాస్టల్ బాత్‌రూమ్‌లో తీవ్ర గాయాలతో పడి ఉన్న కారుణ్యను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. కారుణ్య మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్ ముందు విద్యార్థి సంఘాల నేతలు, కారుణ్య బంధువులు ఆందోళనకు దిగారు. కాలేజ్ ఛైర్మన్ కాంతారావు కారుపై దాడి చేశారు.

కుటుంబ సభ్యుల అనుమానం..(Bhadrachalam)

కొణిజర్ల మండలం సిద్దిక్ నగర్ కు చెందిన కారుణ్య భద్రాచలం మారుతి నర్సింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం నర్సింగ్ చదువుతోంది. కళాశాల హాస్టల్ లో నిన్న బాత్ రూమ్ లో అచేతన స్థితిలో తీవ్ర గాయలతో పడి ఉన్న కారుణ్యను గమనించిన వార్డెన్ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కారుణ్య తుది శ్వాస విడిచింది. కారుణ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారుణ్య మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇలాఉండగా కారుణ్య మృతికి నిరసనగా అఖిలపక్ష విద్యార్థి సంఘం నాయకులు,బంధువులు ఆసుపత్రి నుండి ర్యాలీగా కాలేజికి చేరుకొని ధర్నాకు దిగారు. ఈ సందర్బంగా కళాశాలకు వచ్చిన చైర్మన్ కాంతారావు కారుపై ఒక్కసారిగా వారు దాడికి దిగారు. దీనితో పోలీసులు రంగంలోకి దిగి పరిస్దితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి మృతురాలి బంధువులకు న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి: