Home /Author anantharao b
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే ఇటీవల ముంబైలో ఓటు వేయడానికి భర్త రణవీర్సింగ్తో వెళ్లినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయాయి. సోషల్ మీడియా యూజర్లు ఆమెది ఫేక్ బేబీ బంప్ అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
ఏలూరు జిల్లా మండల కేంద్రమైన మండవల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి మార్కుల మెమోను తీసుకెళ్లేందుకు స్కూల్కు వచ్చిన బాలికను తోటి విద్యార్థి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు.
ఈవీఎం పగలకొట్టిన కేసు లో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతుంది .నాలుగు పోలీస్ బృందాలు పిన్నెల్లి కోసం గాలిస్తన్నాయి .ఏపీ లోనే కాదు తెలంగాణలో కూడా పిన్నెల్లి కోసం విస్తృతంగా పోలీసులు గాలిస్తున్నారు .
ప్రజ్వల్ రేవన్న డిప్లామాటిక్ పాస్పోర్టు రద్దు చేయించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీని మరో మారు కోరారు. ప్రస్తుతం ప్రజ్వల్ రేవన్నపై పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే
బ్రిటన్లో జూలై 4న జనరల్ ఎలక్షన్స్ జరుగనున్నాయి. ప్రధానమంత్రి రిషి సునాక్ బుధవారం నాడు ఎన్నికల తేదీని ప్రకటించారు. అయితే ఈ సారి ఎన్నికల్లో అధికార కన్సర్వేటివ్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
శ్రీశైలం దేవస్థానంలో స్వామి వారి ఉచిత దర్శనానికి వెళ్లే క్యూలైన్ లో భక్తులకు పునుగు పిల్లి కనిపించింది. ఈ విషయాన్ని ఆలయ సిబ్బందికి తెలియజేశారు. అక్కడి చేరుకున్న సిబ్బంది పునుగు పిల్లిని అక్కడి నుంచి సమీప అడవిలోకి తరలించారు.స్వామి వారి దర్శనం కన్నా ముందు పునుగు పిల్లి దర్శనం అయిందని భక్తులు మాట్లాడుకున్నారు
ఏపీలో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ జరపాలని వైసీపీ నేతలు హై కోర్ట్ లో పిటిషన్ లు వేశారు . పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు రిగ్గింగ్లకు పాల్పడ్డారని రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసినా పట్టించుకోలేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు .
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ బూస్దాపితం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కవిత జైలు కు వెల్లిందని , తమ ప్రభుత్వం పోయిందనే ఫ్రస్టేషన్ లో కేటీఆర్ ఉన్నారని అన్నారు.
టీఎస్ ఆర్టీసీ.. టీజీఎస్ ఆర్టీసీగా మార్చింది. ఈ మేరకు టీజీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీగా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని ఆదేశించింది.
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పోటీచేసిన 21 స్థానాలు గెలవబోతున్నట్లు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు . అన్ని సర్వేలు, మీడియా సంస్థల నివేదికలు కూటమి అధికారంలోకి రానున్నట్లు చెబుతున్నాయని.. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన 21 కి 21 స్థానాల్లో గెలవబోతున్నట్లు సమాచారం ఉందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు