Home /Author anantharao b
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన బెయిల్‌ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తన ఆరోగ్యం బాగా దెబ్బతిందని కొన్ని మెడికల్ టెస్ట్ చేయించుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. వాటిలో పెట్ - సీటి స్కాన్ ఒకటి కాగా, తన బరువు ఏడు కిలోల వరకు తగ్గిందని, కీటోన్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయని వివరించారు.
పవువా న్యూ గినియాలో కొండచరియలు విరిగి పడి సుమారు 2,000 మంది కంటే ఎక్కువ మంది మట్టి పెళ్లలో కూరుకుపోయారని అక్కడి జాతీయ విపత్తు కార్యాలయం వెల్లడించింది. అయితే రెస్క్యూ వర్కర్స్ మట్టి పెళ్లలో కూరుకుపోయిన వారిని బయటికి తీయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
పూనేలో ఓ మైనర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరి నిండు ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. పూనేకు చెందిన టాప్ రియల్ ఎస్టేట్ డెవలపర్ కుమారుడు 12వ తరగతి పరీక్ష పాసైన సందర్భంగా తన మిత్రులతో కలిసి పబ్‌లో పార్టీ చేసుకున్నాడు. పార్టీ ముగిసిన తర్వాత మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు స్టాప్‌వేర్ ఉద్యోగులను బలిగొన్నాడు.
మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి తెదేపా తరఫున ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఇటీవల క్రమం తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి .రోడ్లు రక్తపు ఏరులై పారుతున్నాయి .తాజాగా జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు.
రాయల కాలంలో రాయలసీమ రతనాల సీమగా ఒక వెలుగు వెలిగింది . ఇప్పుడు రాయల సీమ నిజంగా రతనాల సీమ మాదిరిగానే మారుతుంది . మట్టిలో మాణిక్యాలు వుంటాయని సామెత .రాయలసీమ మట్టిలో నిజంగానే వజ్రాలు దొరుకుతున్నాయి .
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వేర్వేరు ఘటనల్లో 13 మంది మృతి చెందారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.
తూర్పు ఢిల్లీలోని చిల్ర్డన్ హాస్పిటల్లో శనివారం రాత్రి ఆస్పత్రిలో మంటలకు కొత్తగా పుట్టిన ఏడుగురు నవజాత శిశువులు ఆశువులు బాశారు. రెండు నెలల క్రితమే ఈ ఆస్పత్రి లైసెన్సు ముగిసినా.. ఆస్పత్రి మాత్రం యధాతథంగా నడుస్తోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధికారులు తెలిపారు.
ఖమ్మం-నల్గొండ- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్హ కొనసాగుతోంది. పట్ట భద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి.. సాయంత్రం 4 గంటల వరకు ఈసీ అవకాశం కల్పించింది.
హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఫార్మా దిగ్గజం దివీస్ లేబరేటరీస్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఫలితాలు రికార్డు బద్దలు కొట్టింది. కాగా ఫార్మా దిగ్గజం మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికరలాభం ఏకంగా 67.6 శాతం పెరిగి రూ.538 కోట్లకు ఎగబాకింది.