Home /Author anantharao b
నోయిడా నగరంలోని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లిఫ్ట్‌లో పెంపుడు కుక్క 6 ఏళ్ల చిన్నారిని కరిచినందుకు గ్రేటర్ నోయిడా అథారిటీ పెంపుడు యజమానికి రూ.10,000 జరిమానా విధించింది.
2024 ఎన్నికలు తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు చెప్పినట్టుగా జరుగుతుందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనం మంచి కోరుకుంటే మంచి, చెడు కోరుకుంటే చెడు జరుగుతుందన్నారు.
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు యుగంధర్ ఈడీ విచారణకు హాజరయ్యారు.
ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం తరచూ రిపేర్లకు గురవుతోందని అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఒక వినూత్న వీడియోను షేర్ చేసారు. ఇది ఎల్పిజి సిలిండర్లను క్యూఆర్ కోడ్లతో ఎలా పొందుపరచబడుతుందో చూపిస్తుంది. తద్వారా వాటిని ట్రాక్ చేయవచ్చు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ జన్మదిన వేడుకల కోసం సిద్ధం చేసిన కేక్ ఆలయం నమూనాలో ఉండటం, దానిపై హనుమంతుడి చిత్రం ఉండటంపై వివాదం చెలరేగింది.
మార్కెట్లో కిలో 20 రూపాయలకు పైనే అమ్ముతున్న టమోటా, రైతు దగ్గర కిలో రూ.1కే కొంటుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత బోండా ఉమపై ట్విట్టర్లో సెటైర్లు వేసారు. రెండేళ్ల నుంచి 2000 రూపాయలనోట్లు ముద్రించనపుడు ఎలా కనపడతాయంటూ ప్రశ్నించారు. బహుశా చంద్రబాబు ఇంట్లోనే చూసి ఉంటాడంటూ చమత్కరించారు.
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఆర్దికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పిట్టకధల మంత్రి అంటూ వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు వీటిని ఏర్పాటు చేశారని సమాచారం.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్ర సృష్టించేందుకు అడుగులు వేస్తోంది. అంతరిక్ష ప్రయోగాలకు ప్రయివేట్ రంగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మొట్ట మొదటిసారి ఓ ప్రయివేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.