Home /Author anantharao b
యునైటెడ్ స్టేట్స్ మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మరియు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన హెన్రీ కిస్సింజర్ బుధవారం 100 సంవత్సరాల వయస్సులో మరణించారు.కిస్సింజర్ కనెక్టికట్‌లోని తన ఇంట్లో మరణించారని కిస్సింజర్ అసోసియేట్స్ తెలిపింది.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాగర్ రైట్ కెనాల్ కు నీటిని విడుదల చేయడం కోసం ఏపీ పోలీసులు రావడంతో వివాదం చెలరేగింది. దాంతో ప్రాజెక్ట్ వద్ద విద్యుత్ సరాఫరాను అధికారులు నిలిపివేశారు. ఇక ఏపీ పోలీసులు డ్యామ్ గేట్లు ధ్వంసం చేసి ఎస్పీఎఫ్ పోలీసులపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.
అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం జపాన్ సముద్రంలో కుప్పకూలింది. యకుషిమా దీవి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో ఆరుగురు సైనిక సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో స్పృహతప్పి కనిపించిన ఒక వ్యక్తిని జపాన్ కోస్ట్‌గార్డు సిబ్బంది హుటాహుటిన యకుషిమాలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసును సీబీఐకి ఇవ్వాలన్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్‌పై విచారణ డిసెంబర్ 13కి వాయిదా పడింది. ఈ కేసులో కొంతమందికి నోటీసులు అందలేదని పిటిషనర్ తరపు లాయర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు.
ఏపీలో క్లీనింగ్ యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసు వద్ద పచ్చ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. జాతీయ సఫాయి కర్మచారిస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌కెఎఫ్‌డిసి) సహకారంతో స్వచ్ఛత ఉద్యమి యోజన (ఎస్‌యువై) కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎంపిక చేసిన 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు (సఫాయి కర్మచారిలు) ముఖ్యమంత్రి లాంఛనంగా వాహనాలను అందజేశారు.
ఖతార్- మరియు ఈజిప్ట్ మధ్యవర్తిత్వ ఒప్పందం శుక్రవారం అమలులోకి వచ్చినప్పటి నుండి హమాస్ 50 మందికి పైగా ఇజ్రాయెల్ మహిళలు మరియు పిల్లలను విడుదల చేసారు. వారిలో 17 మంది థాయ్‌లాండ్ పౌరులు ఉన్నారు.అక్టోబరు 7న హమాస్ దాడుల్లో పట్టుబడిన 160 మందికి పైగా బందీలు ఇప్పటికీ గాజా స్ట్రిప్‌లో ఉన్నారు.
యునైటెడ్ స్టేట్స్ డిసెంబర్లో కొన్ని వర్గాల H-1B వీసాలను దేశంలోనే రెన్యువల్ చేసుకునే పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. దీనిద్వారా స్వదేశాలకు వెళ్లకుండా ఎన్నారైలు తమ వీసాలను రెన్యువల్ చేసుకోవచ్చు. ఇది గణనీయమైన సంఖ్యలో భారతీయ సాంకేతిక నిపుణులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రణ్‌బీర్ కపూర్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన యానిమల్ చిత్రం గురించిన సందడి సోషల్ మీడియానే కాకుండా సినీ వర్గాల్లో కూడా వ్యాపించింది. గతంలో కబీర్ సింగ్‌కి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 1న విడుదలకు ముందు సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ( సీబీఎఫ్ సీ) ఈ చిత్రానికి A సర్టిఫికేట్ ఇస్తూ ఐదు కట్స్ కూడా రికమెండ్ చేసింది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బుధవారం టీమ్ ఇండియా (సీనియర్ పురుషులు) కోచింగ్ స్టాఫ్ కాంట్రాక్టులను పొడిగిస్తున్నట్లు ప్రకటించడంతో రాహుల్ ద్రావిడ్ భారత ప్రధాన కోచ్‌గా కొనసాగనున్నారు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే మరియు ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌తో సహా సహాయక సిబ్బందిలోని ఇతర సభ్యుల ఒప్పందాలను కూడా బిసిసిఐ పొడిగించింది.
పేదలకు నెలకు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలను అందించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం మరో ఐదేళ్లపాటు పొడిగించింది. ఈ పథకం కింద, కేంద్రం 1 జనవరి 2023 నుండి పిఎంజికెఎవై కింద అంత్యోదయ అన్న యోజన (AAY) గృహాలు మరియు ప్రాధాన్యతా గృహాల (PHH) లబ్ధిదారులకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందిస్తోంది.