Home /Author anantharao b
ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య తాత్కాలిక సంధిని మరో రెండు రోజులు పొడిగించినట్లు మధ్యవర్తి కతార్ సోమవారం ప్రకటించింది.మరో 33 మంది పాలస్తీనా ఖైదీల విడుదలతో పాటుగా గాజా నుండి మరో 11 మంది బందీలను వదిలిపెట్టిన తరువాత సంధి పొడిగింపు జరిగింది.
వారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపి మసీదు సముదాయానికి సంబంధించిన శాస్త్రీయ సర్వే నివేదికను సమర్పించేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మరో 21 రోజుల గడువు కోరింది. ఏఎస్ఐ తన నివేదికను నవంబర్ 28న సమర్పించవలసి ఉంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలన్న సిఐడి పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. గతవారం ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం వాదనలు విననుంది
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి చంద్రబాబు హయాంలో కంటే 13.2 లక్షల కోట్లకు పెరిగిందని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో 15వ స్థానంలో ఉన్న రాష్ట్రం దేశంలోనే పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే 5వ స్థానంలో ఉందన్నారు. ఇవన్నీ పచ్చ కళ్లద్దాల వల్ల పురంధేశ్వరికి కనిపించడంలేదని మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి కాచిగూడ వరకు 2 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్‌షో సాగింది. ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ప్రధాని ముందుకు సాగారు. ప్రధాని మోదీపై అభిమానులు, కార్యకర్తలు పూల వర్షం కురిపించారు.
దేశంలోని కొన్ని సంపన్న కుటుంబాలు విదేశాల్లో వివాహ వేడుకలు చేసుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారంనాడు జరిగిన ''మన్ కీ బాత్'' కార్యక్రమంలో ప్రస్తావించారు. ఈ వేడుకలను భారత్‌లోనే చేసుకువాలని వారికి విజ్ఞప్తి చేశారు. అందువల్ల దేశంలోని సొమ్ము దేశాన్ని వీడి వెళ్లదని అన్నారు. వివాహాల కోసం షాంపింగ్ చేసేటప్పుడు ఇండియాలో తయారైన ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామన్న ఆ పార్టీ వ్యాఖ్యలపై ఆలిండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇది విభజన రాజకీయాలకు అద్దంపడుతోందన్నారు.
14 మంది సిబ్బందితో ఉప్పును తీసుకెళ్తున్న కార్గో షిప్ లెస్బోస్ ద్వీపంలో మునిగిపోవడంతో ఒకరు మరణించగా, 12 మంది తప్పిపోయినట్లు గ్రీక్ కోస్ట్ గార్డ్ తెలిపింది.కొమొరోస్-ఫ్లాగ్డ్ రాప్టర్ ఈజిప్ట్‌లోని ఎల్ దేఖీలా ఓడరేవు నుండి ఇస్తాంబుల్‌కు బయలుదేరి వెడుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.
చైనాలో ప్రతి ఏటా జరిగే సివిల్ సర్వీస్ పరీక్షకు మూడు మిలియన్లకు పైగా అభ్యర్దులు హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్దాయిలో హాజరు ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన ఉద్యోగాన్ని పొందడం గురించి యువతలో పెరుగుతున్న ఆందోళనలను హైలైట్ చేస్తుందని పరిశీలకులు చెబుతున్నారు.
నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం 2.5 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉంటారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు. ఇప్పటివరకు 1,68,612 పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయగా నవంబర్ 26 వరకు 96,526 పోలింగ్ జరిగినట్లు తెలిపారు.