Home /Author anantharao b
మామూలుగా అయితే ప్రేమకి, ఆపై పెళ్ళికి నిరాకరించిందని ప్రియురాలిపై పగ తీర్చుకునే ప్రియుళ్ళని చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. మాజీ ప్రేమికుడి మీద పగ సాధించేందుకు ఓ యువతి అతడిని తప్పుడు కేసులో ఇరికించాలనుకుంది. హైదరాబాద్ లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలివి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రేపటినుంచి నాలుగు రోజులపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల తరువాత రాజమండ్రి విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ తన యూట్యూబ్ ఛానెల్‌కు 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లను కలిగివున్న తొలి ప్రపంచ నేతగా నిలిచారు. ప్రధానమంత్రి యూట్యూబ్ ఛానెల్‌కు మొత్తం 20 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు, అందులో 23,000 వీడియోలు అప్లోడ్ చేయబడ్డాయి.
పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బునెర్ జిల్లాలో తొలిసారిగా హిందూ మహిళ డాక్టర్ సవీరా పర్కాశ్ దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జనరల్ సీటుకు నామినేషన్ పత్రాలను దాఖలు చేసారు.
సెంట్రల్ నైజీరియాలో గ్రామాలపై వరుస దాడుల్లో భాగంగా సాయుధ గ్రూపులు సుమారుగా 160 మందిని చంపినట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు సోమవారం తెలిపారు. మొదట కేవలం 16 మంది మరణించినట్లు సైన్యం ప్రకటించినప్పటికీ తరువాత మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
INS ఇంఫాల్, ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఒక నగరం పేరు పెట్టబడిన మొట్టమొదటి యుద్ధనౌక భారత నౌకాదళంలోకి ప్రవేశించింది.మంగళవారం ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో దీనిని భారత నావికాదళంలో ప్రవేశపెట్టిన సందర్బంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నౌక యొక్క చిహ్నాన్ని ఆవిష్కరించారు.
బుధవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. కల్యాణ కట్ట పీస్ రేట్ క్షురకులకు నెలకు కనీసం 20 వేల వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే పోటు కార్మికులకు 10వేల రూపాయల చొప్పు జీతం పెంచాలని ఆదేశించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. బేగంపేట విమానాశ్రయంనుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ప్రధాని మోదీతో రేవంత్, భట్టి ఈ సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా కారంచేడులో మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా ఓడిపోవడం మంచిదయిందని అన్నారు. అంతేకాదు సీఎం జగన్ తన కొడుక్కి ఎమ్మెల్సీ ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసానని అన్నారు.