Last Updated:

INS Imphal: భారత నౌకాదళంలోకి మరో కొత్త యుద్ధనౌక INS ఇంఫాల్..

INS ఇంఫాల్, ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఒక నగరం పేరు పెట్టబడిన మొట్టమొదటి యుద్ధనౌక భారత నౌకాదళంలోకి ప్రవేశించింది.మంగళవారం ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో దీనిని భారత నావికాదళంలో ప్రవేశపెట్టిన సందర్బంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నౌక యొక్క చిహ్నాన్ని ఆవిష్కరించారు.

INS Imphal: భారత నౌకాదళంలోకి  మరో కొత్త యుద్ధనౌక INS ఇంఫాల్..

INS Imphal: INS ఇంఫాల్, ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఒక నగరం పేరు పెట్టబడిన మొట్టమొదటి యుద్ధనౌక భారత నౌకాదళంలోకి ప్రవేశించింది.మంగళవారం ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో దీనిని భారత నావికాదళంలో ప్రవేశపెట్టిన సందర్బంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నౌక యొక్క చిహ్నాన్ని ఆవిష్కరించారు.

ఈ నౌక ప్రత్యేకత ఏమిటంటే..(INS Imphal)

INS ఇంఫాల్ 164 మీటర్ల పొడవుతో గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్, అత్యాధునిక ఆయుధాలు మరియు సెన్సార్‌లతో కూడి ఉంది. దీనిలో ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు, యాంటీ-షిప్ క్షిపణులు మరియు టార్పెడోలు, జలాంతర్గామి వ్యతిరేక స్వదేశీ రాకెట్ లాంచర్లు మరియు 76mm సూపర్ రాపిడ్ గన్ మౌంట్ ఉన్నాయి. ఉన్నాయి. ఈ నౌకకు మణిపూర్ రాజధాని నగరం పేరు పెట్టడం జాతీయ భద్రత మరియు శ్రేయస్సు కోసం ఈశాన్య ప్రాంతం యొక్క ప్రాముఖ్యతను చెబుతుంది.గ్యాస్ (COGAG) ప్రొపల్షన్ ద్వారా ఆధారితమైన ఈ నౌక 30 నాట్స్ (56 కిమీ/గంట) కంటే ఎక్కువ వేగాన్ని అందుకోగలదు.

ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత నౌకాదళంలోకి ‘INS ఇంఫాల్’ చేరిక రక్షణ రంగంలో భారతదేశం యొక్క స్వావలంబనను తెలియజేస్తుంది. ఇది జాతీయ భద్రత పట్ల మజగాన్ డాక్ యార్డు లిమిటెడ్ మరియు నేవీ యొక్క నిబద్ధత మరియు కృషిని ప్రతిబింబిస్తుంది. INS ఇంఫాల్‌ను ప్రారంభించడం భారత నౌకాదళాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.