China: యుద్ధానికి సిద్ధం కావాలి – సైన్యానికి జిన్‌పింగ్ పిలుపు
Xi Jinping Asks Troops To Prepare For War: మరోసారి చైనా, తైవాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యుద్ధానికి సిద్ధం కావాలంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తమ దేశ సైనికులకు పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా చైనాకు చెందిన సైనిక విమానాలు, నౌకలు తైవాన్ భూభాగంలోకి వెళ్లినట్టు ఆ దేశం తెలిపింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆదివారం ఉదయం 6 గంటలకు చైనాకు చెందిన ఆరు సైనిక విమానాలు, ఏడు నౌకదళ నౌకలు తైవాన్ భూభాగంలో గుర్తించినట్టు ఆ దేశ జాతీయ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. అలాగే రెండు విమానాలు మధ్యస్థ రేఖను దాటి తైవాన్ నైరుతి వైమానికి రక్షణ గుర్తింపు జోన్‌లోకి ప్రవేశించడం తైవాన్ రక్షణ శాఖ అప్రమత్తమైనట్టు పేర్కొంది.
కాగా ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్‌కు చెందిన బ్రిగేడ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ… యుద్ధానికి సన్నాహాలను సమగ్రంగా బలోపేతం చేయాలని, దళాలు పటిష్టమైన పోరా సామర్థ్యాలను కలిగి ఉండేలా చూడాలని సైన్యానికి సూచించారు. అంతేకాదు సైనికులు తమ వ్యూహాత్మక పోరాట సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. దేశ భద్రత, ప్రయోజనాలను కాపాడాలని ఆయన సైన్యంతో పేర్కొన్నారు.