Vivo Y19s: అవాక్కయ్యారా.. వివో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లంటే ఇలా ఉండాలి!
Vivo Y19s: వివో తన కొత్త Y-సిరీస్‌లో Vivo Y19 స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ ఫోన్ భారీ 5,500mAh బ్యాటరీతో వస్తుంది. 8GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు ఆక్టాకోర్ యూనిసాక్ చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుంది. ఫోన్ లుక్ కూడా చాలా అట్రాక్ట్‌గా కనిపిస్తుంది. ఇది పెద్ద 6.68 అంగుళాల డిస్‌ప్లే, ఫోటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. కొత్త Vivo Y19s ప్రత్యేకతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
ప్రస్తుతం Vivo దీన్ని బంగ్లాదేశ్, యూఏఈ, రష్యా, వియత్నాం, మయన్మార్, పాకిస్థాన్, సౌదీ అరేబియా, కంబోడియా, ఈజిప్ట్, థాయ్‌లాండ్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లలో విడుదల చేసింది. ప్రస్తుతానికి ఇది భారతదేశంలో ప్రారంభించబడుతుందా లేదా అనే దానిపై ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. బ్లాక్,బ్లూ, సిల్వర్ కలర్స్‌లో కొత్త ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. కంపెనీ Vivo Y19s ధరను ప్రకటించలేదు.
Vivo Y19s Specifications
Vivo Y19s నేది డ్యూయల్ సిమ్ (నానో + నానో) ఫోన్, ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా FuntouchOS 14పై రన్ అవుతుంది. ఇది 6.68 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది HD ప్లస్ (720×1608 పిక్సెల్స్) రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 264 ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. ఫోన్ 6GB LPDDR4X RAMతో జత చేసిన 12nm ఆక్టా కోర్ Unisock T612 ప్రాసెసర్‌తో ఉంటుంది. ఫోన్ 128GB eMMC 5.1 స్టోరేజ్ కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు.
ఫోటోగ్రఫీ కోసం Vivo Y19s రెండు బ్యాక్ కెమెరాలను కలిగి ఉంది. వీటిలో f/1.8 ఎపర్చరుతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, f/3.0 ఎపర్చర్‌తో 0.08 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. వీడియో కాల్‌ల కోసం డిస్‌ప్లే మధ్యలో ఉన్న పంచ్ హోల్ కటౌట్‌లో 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫోన్ 5500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. బాక్స్‌లో బండిల్ చేసిన ఛార్జింగ్ అడాప్టర్ నుండి 15W వద్ద ఛార్జ్ చేయవచ్చు. కంపెనీ ప్రకారం థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్‌లోని కస్టమర్లకు బాక్స్‌లో ఛార్జర్ లభించదు.
ఫోన్‌లో 4G LTE డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS కనెక్టివిటీ అలాగే USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, వర్చువల్ గైరోస్కోప్ వంటి సెన్సార్లు ఫోన్‌లో అందించారు. ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని కలిగి ఉంది.