RR vs SRH: మెరిసిన సంజు శాంసన్, బట్లర్.. సన్ రైజర్స్ లక్ష్యం 215 పరుగులు
RR vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది.టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
RR vs SRH: రాజస్థాన్ బ్యాటర్లు మెరిశారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేశారు. జోస్ బట్లర్ 95 పరుగులు చేయగా.. శాంసన్ 66 పరుగులతో రాణించాడు. జాన్సెన్, భువనేశ్వర్ తలో వికెట్ తీసుకున్నారు.
LIVE NEWS & UPDATES
-
KKR vs PBKS: ప్రారంభమైన మ్యాచ్
కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది పంజాబ్. శిఖర్ ధావన్, ప్రభ్ సిమ్రన్ లు ఓపెనర్లుగా వచ్చారు.
-
RR vs SRH: మెరిసిన సంజు శాంసన్, బట్లర్.. సన్ రైజర్స్ లక్ష్యం 215 పరుగులు
రాజస్థాన్ బ్యాటర్లు మెరిశారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేశారు. జోస్ బట్లర్ 95 పరుగులు చేయగా.. శాంసన్ 66 పరుగులతో రాణించాడు. జాన్సెన్, భువనేశ్వర్ తలో వికెట్ తీసుకున్నారు.
-
RR vs SRH: చెలరేగుతున్న బట్లర్.. 150 పరుగులు దాటిన రాజస్థాన్
రాజస్థాన్ బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. 15 ఓవర్లు ముగిసేసరికి 154 పరుగులు చేశారు.
-
RR vs SRH: బట్లర్ అర్దసెంచరీ.. దూకుడుగా ఆడుతున్న శాంసన్
బట్లర్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.
-
RR vs SRH: 10 ఓవర్లకు 107 పరుగులు
10 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 107 పరుగులు చేసింది. బట్లర్, శాంసన్ సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు.
-
RR vs SRH: శాంసన్ జోరు.. వరుస సిక్సులు
వరుసగా రెండు బంతుల్లో రెండు సిక్సులు కొట్టాడు శాంసన్.
-
RR vs SRH: ముగిసిన పవర్ ప్లే.. 61 పరుగులు చేసిన రాజస్థాన్
పవర్ ప్లే లో రాజస్థాన్ 61 పరుగులు చేసింది. క్రీజులో శాంసన్, బట్లర్ ఉన్నారు.
-
RR vs SRH: తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్..
రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. జోరు మీదున్న జైస్వాల్ క్యాచ్ ఔటయ్యాడు.
-
RR vs SRH: రెండో ఓవర్లో 17 పరుగులు..
జాన్సెన్ వేసిన రెండో ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. చివరి బంతికి జైస్వాల్ సిక్స్ కొట్టాడు.
-
RR vs SRH: తొలి ఓవర్.. 9 పరుగులు
భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. క్రీజులో జైస్వాల్, జోస్ బట్లర్ ఉన్నారు.
-
RR vs SRH: హైదరాబాద్ జట్టు ఇదే
అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, వివ్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్
-
RR vs SRH: రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, సందీప్ శర్మ, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్