SRH vs KKR: ఉప్పల్ వేదికగా మ్యాచ్.. వరుణుడు కరుణిస్తాడా?
SRH vs KKR: హోం గ్రౌండ్ వేదికగా.. సన్ రైజర్స్ మరో పోరుకు సిద్దమైంది. ఇది వరకే కోల్ కతా ను తమ హోం గ్రౌండ్ లో ఓడించిన సన్ రైజర్స్.. ఈ మ్యాచ్ లోను హవా కొనసాగించాలని చూస్తోంది.
SRH vs KKR: హోం గ్రౌండ్ వేదికగా.. సన్ రైజర్స్ మరో పోరుకు సిద్దమైంది. ఇది వరకే కోల్ కతా ను తమ హోం గ్రౌండ్ లో ఓడించిన సన్ రైజర్స్.. ఈ మ్యాచ్ లోను హవా కొనసాగించాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచుకు వరుణుడు.. సహకరిస్తాడా లేదా అనేది అనుమానంగా ఉంది.
ఉప్పల్ వేదికగా మ్యాచ్.. (SRH vs KKR)
హోం గ్రౌండ్ వేదికగా.. సన్ రైజర్స్ మరో పోరుకు సిద్దమైంది. ఇది వరకే కోల్ కతా ను తమ హోం గ్రౌండ్ లో ఓడించిన సన్ రైజర్స్.. ఈ మ్యాచ్ లోను హవా కొనసాగించాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచుకు వరుణుడు.. సహకరిస్తాడా లేదా అనేది అనుమానంగా ఉంది. నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తో హైదరాబాద్ ఢీ కొట్టేందుకు సిద్దమైంది. గత మ్యాచ్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని నైట్ రైడర్స్ భావిస్తోంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.
బ్యాటింగ్ లో ఇబ్బంది..
సన్ రైజర్స్ హైదరాబాద్ కు బ్యాటింగ్ శాపంగా మారింది. ఓ ఒక్క బ్యాట్స్ మెన్ కూడా నిలకడగా రాణించడం లేదు. మరికొన్ని సందర్భాల్లో గెలవాల్సిన మ్యాచులను కూడూ చేజేతులా పోగొట్టుకుంటుంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో కేవలం మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. ఐదింటిలో ఓడిపోయింది. కోట్లు పోసి కొనుక్కున్న బ్రూక్ దారుణంగా విఫలం అవుతున్నాడు. ఒక్క మ్యాచ్‌లో సెంచరీ మినహా పెద్దగా రాణించింది లేదు. అది కూడా కోల్‌కతపై సాధించాడు. హిట్టర్లుగా పేరొందిన రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ తేలిపోతున్నారు. ఇక జట్టు కెప్టెన్ మర్ క్రమ్ సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు.
బౌలింగ్ లో విఫలం..
ఒకప్పుడు స్వల్వ లక్ష్యాలను సైతం సన్ రైజర్స్ కాపాడుకునేది. కానీ ఈ సీజన్ లో బౌలింగ్ తేలిపోతుంది. నటరాజన్, భువనేశ్వర్, మాయంక్ మార్కండే మాత్రమే రాణిస్తున్నారు. ఇక ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్.. ధారళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్.. మార్కో జాన్సెన్ కూడా ఆశించిన ప్రతిభ చూపడం లేదు.
కోల్‌కతా పరిస్థితి ఇదీ..
టోర్ని ప్రారంభంలో ఊపుమీదున్న కోల్ కతా ఆ తర్వాత తేలిపోయింది. ఆరు మ్యాచుల్లో కేవలం ఒకదాంట్లోనే విజయం సాధించి.. ఐదింటా ఓడిపోయింది.
ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి శభాష్ అనిపించుకుంది.
ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న కేకేఆర్.. ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే టాప్ 4లోకి వచ్చే అవకాశం ఉంది.
జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, గుర్బాజ్ రాణిస్తున్నా.. రస్సెల్ నుండి భారీ ఇన్సింగ్స్ బాకీ ఉంది.
రింకూ సింగ్ చివరి వరకూ క్రీజ్‌లో ఉంటున్నా గుజరాత్‌పై ఆడిన ఐదు సిక్స్‌ల ఇన్నింగ్స్ రిపీట్ చేయలేకపోతున్నాడు.
వాతావరణం ఇలా..
ఈ మ్యాచ్ కు వరుణకు అడ్డంకి కలగించే అవకాశం ఉంది. నగరంలో వాతావరణం చల్లబడి వర్షం పడే అవకాశం ఉంది.
దీంతో పూర్తిస్థాయి మ్యాచ్ జరుగుతుందో లేదో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.