SRH vs DC: ఢీ అంటే ఢీ.. ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్.. డీసీ టార్గెట్ 198 రన్స్
ఐపీఎల్ 2023లో భాగంగా హోంటౌన్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
SRH vs DC: ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 198 రన్స్ చేసింది. దానితో ఢిల్లీ జట్టు టార్గెట్ 198 రన్స్ గా ఉంది. పవర్ ప్లే మరియు ఆఖరి ఓవర్లలో సన్ రైజర్స్ జట్టు బ్యాటర్లు బాగా పర్ఫార్మ్ చేశారనే చెప్పాలి. అభిషేక్ శర్మ(36 బంతుల్లో 67 పరుగులు) మరియు క్లాసెస్(27 బంతుల్లో 53 పరుగులతో నాటౌట్) హాఫ్ సెంచరీలు జట్టుకు ఓ మంచి స్కోర్ ఇచ్చాయి. ఐపీఎల్ 2023లో భాగంగా హోంటౌన్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. డిల్లీ బౌలర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్ లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు.
ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో రెండు జట్లకూ నాలుగు పాయింట్లు ఉన్నాయి. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండు మ్యాచులు గెలిచి 9 స్థానంలో ఉండగా, వరుస పరాజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది.
LIVE NEWS & UPDATES
-
ఢిల్లీ టార్గెట్ 198
నిర్ణీత 20 ఓవర్లో హైదరాబాద్ జట్టు 197 పరుగులు చేసింది. దానితో ఢిల్లీ జట్టు టార్గెట్ 198 రన్స్ గా ఉంది.
-
క్లాసెస్ హాఫ్ సెంచరీ
క్లాసెస్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 25 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ స్కోర్ 191/6.
-
ఆరో వికెట్ డౌన్.. సమద్ ఔట్
మిచెల్ మార్ష్ బౌలింగ్లో సన్ రైజర్స్ బ్యాటర్ సమద్ ఔట్ అయ్యాడు. 21 బంతుల్లో 28 పరుగులు చేసి సమద్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం హైదరాబాద్ స్కోర్ 162/6.
-
15 ఓవర్లు: హైదరాబాద్ స్కోర్ 136/5
15 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ స్కోర్ 136/5. ప్రస్తుతం క్రీజులో సమద్, క్లాసెస్ ఉన్నారు.
-
అభిషేక్ శర్మ ఔట్
అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. 36 బంతుల్లో 67 పరుగులు చేసి అభిషేక్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం హైదరాబాద్ స్కోర్ 109/5.
-
10 ఓవర్లు: హైదరాబాద్ జట్టు స్కోర్ 83/4
10 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ జట్టు స్కోర్ 83/4. క్రీజులో అభిషేక్ మరియు క్లాసెస్ ఉన్నారు.
-
వచ్చీ రాగానే బ్రూక్ ఔట్
మిచెల్ మార్ష్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్ ఔట్ అయ్యాడు. రెండు బంతుల్లో ఒక్క పరుగు కూడా చెయ్యకుండానే బ్రూక్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం హైదరాబాద్ స్కోర్ 83/4.
-
కెప్టెన్ మార్ క్రమ్ ఔట్
కెప్టెన్ మార్ క్రమ్ ఔట్ అయ్యారు. 8 బంతుల్లో 13 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు స్కోర్ 83/3.
-
అభిషేక్ హాఫ్ సెంచరీ
అభిషేక్ హాఫ్ సెంచరీ చేశాడు. 25 బాల్స్ లో 50 రన్స్ పూర్తి చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ స్కోర్ 72/2. క్రీజులో మార్ క్రమ్, అభిషేక్ శర్మ ఉన్నారు.
-
పవర్ ప్లే: హైదరాబాద్ స్కోర్ 62/2
పవర్ ప్లే ముగిసే సరికి హైదరాబాద్ స్కోర్ 62/2. ప్రస్తుతం క్రీజులో మార్ క్రమ్, అభిషేక్ ఉన్నారు.
-
5 ఓవర్లు: హైదరాబాద్ స్కోర్ 46/2
5 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ స్కోర్ 46/2. ప్రస్తుతం క్రీజులో అభిషేక్ మరియు సన్ రైజర్స్ కెప్టెన్ మార్ క్రమ్ ఉన్నారు.
-
రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
రాహుల్ త్రిపాటి 6 బంతుల్లో 10 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్ స్కోర్ 45/2.
-
మొదటి వికెట్ కోల్పోయిన హైదరాబాద్
మొదటి వికెట్ కోల్పోయిన హైదరాబాద్ జట్టు. ఇషాన్ శర్మ బౌలింగ్లో మయాంక్ అగర్వాల్ పెవిలియన్ చేరాడు. 6 బంతుల్లో 5 పరుగులు చేసి మయాంక్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్ స్కోర్ 21/1.
-
మయాంక్ పరుగుల మాయ చేస్తాడా..?
బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టు. ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ వచ్చారు
-
తుది జట్లు ఇవే
ఢిల్లీ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్, మనీశ్ పాండే, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్
సన్‌రైజర్స్ తుది జట్టు
హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, అకేల్ హోసేన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్
-
టాస్ గెలిచిన హైదరాబాద్
టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.