Last Updated:

Yamaha FZ-S Fi Hybrid: యమహా హైబ్రిడ్ బైక్.. 71 కిమీ మైలేజ్.. యూత్ వదలకండి..!

Yamaha FZ-S Fi Hybrid: యమహా హైబ్రిడ్ బైక్.. 71 కిమీ మైలేజ్.. యూత్ వదలకండి..!

Yamaha FZ-S Fi Hybrid: యమహా జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ. ఇటీవలే, కొత్త FZ-S Fi హైబ్రిడ్ (FZ-S Fi హైబ్రిడ్) బైక్‌ను గ్రాండ్‌గా విడుదల చేసింది. దీని డిజైన్, ఫీచర్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. బడ్జెట్ ధరలో కూడా లభిస్తుంది. దీని ధర రూ.1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). ‘FZ-S Fi’ హైబ్రిడ్ (పెట్రోల్+ఎలక్ట్రిక్) టెక్నాలజీతో 150సీసీ సెగ్మెంట్‌లో దేశంలోనే మొట్టమొదటి మోటార్‌సైకిల్ కూడా. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Yamaha FZ-S Fi Hybrid Features
ఈ బైక్ డిజైన్‌ చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో కొత్త హెడ్‌లైట్, పెద్ద ఇంధన ట్యాంక్, ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్ టర్న్ సిగ్నల్‌ ఉంది. దీనితో పాటు రేసింగ్ బ్లూ, సియాన్ మెటాలిక్ గ్రే రంగులలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ హైబ్రిడ్ మోటార్‌సైకిల్ OBD-2B ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేసిన 149 cc ఫోర్-స్ట్రోక్ టూ-వాల్వ్, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ 12.4 బిహెచ్‌పి హార్స్ పవర్, 13.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేసి ఉంటుంది.

బైక్ పూర్తి- కలర్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంది. ఇది బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్స్, కాల్,ఎస్ఎమ్ఎస్ అలర్ట్‌లకు సపోర్ట్ చేస్తుంది.స్మార్ట్ మోటార్ జనరేటర్ టెక్నాలజీ కూడా ఉంది. హైబ్రిడ్ మోటార్‌సైకిల్ ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ ఉంది. రైడర్ రక్షణ కోసం డిస్క్ బ్రేక్‌లు కూడా ఉన్నాయి.

Yamaha FZ-S Fi Hybrid Mileage
అలాగే, ఈ బైక్ 138 కిలోల బరువు,13 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. కెపాసిటీ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ వచ్చింది. హైబ్రిడ్ (పెట్రోల్+ఎలక్ట్రిక్) ఇంజన్ టెక్నాలజీని కలిగి ఉండటం వల్ల పనితీరు మెరుగుపడింది. ఇది అధిక మైలేజ్ ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది. సుమారు 71 kmpl మైలేజీని అందిస్తుందని అంచనా. అలాగే, కొత్త మోటార్‌సైకిల్, దాని అద్భుతమైన డిజైన్, ఫీచర్లతో, రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో కస్టమర్‌ల ఎంపిక వాహనంగా మారనుంది.