Last Updated:

Simple OneS Electric Scooter: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్ చాలు.. 181 కిమీ దూసుకుపోతుంది..!

Simple OneS Electric Scooter: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్ చాలు.. 181 కిమీ దూసుకుపోతుంది..!

Simple OneS Electric Scooter: బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ. దేశీయ మార్కెట్‌లో సింపుల్ వన్ పేరుతో ఈ-స్కూటర్‌ను విజయవంతంగా విక్రయిస్తోంది. ఇది ఆకర్షణీయమైన ఫీచర్లతో సరసమైన ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది, కాబట్టి వినియోగదారులు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు, కంపెనీ సరికొత్త ‘Simple OneS Electric Scooter’ను విడుదల చేసింది. రండి.. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

కొత్త సింపుల్ వన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మధ్యతరగతి ప్రజల కోసం రూపొందించిన ద్విచక్ర వాహనం, బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంటుంది.దీని ధర రూ.1,39,999 ఎక్స్-షోరూమ్. ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో శక్తివంతమైన 3.7 కిలోవాట్ కెపాసిటీ బ్యాటరీ ప్యాక్‌ఉంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 181 కిలోమీటర్ల రేంజ్ (మైలేజీ) ఇస్తుంది. ఇందులో 8.5 కిలోవాట్ల మోటారును ఉపయోగించారు. దీని గరిష్ట వేగం గంటకు 105 కి.మీ.

కొత్త సింపుల్ వన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 2.55 సెకన్లలో 40 kmph వేగాన్ని అందుకుంటుంది. ఎకో, రైడ్, డాష్, సోనిక్ రైడింగ్ మోడ్‌లు ఇందులో ఉంటాయి. దీనిలో 35 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్,ఉంది. అలానే సీట్ ఎత్తు 770 మిమీ. ఎలక్ట్రిక్ స్కూటర్ బయట మరింత స్పోర్టీగా ఉండే అధునాతన డిజైన్‌‌తో వచ్చింది. యాంగులర్ హెడ్‌లైట్‌లు, స్లోపింగ్ సీట్లు, షార్ప్ బాడీ ప్యానెల్స్ ఉన్నాయి.

బ్రాజెన్ బ్లాక్, గ్రే వైట్, అజూర్ బ్లూతో సహా నాలుగు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది. స్కూటర్‌లో డజన్ల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, ఫైండ్ మై వెహికల్, రాపిడ్ బ్రేకింగ్ సిస్టమ్, Wi-Fi, టర్న్-బై-టర్న్ నావిగేషన్, పార్క్ అసిస్ట్ ఫంక్షన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి చూడచ్చు.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ బెంగళూరు, పూణె, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, కొచ్చి, మంగళూరులోని కంపెనీకి చెందిన 15 విభిన్న షోరూమ్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. సింపుల్ ఎనర్జీ తమిళనాడులోని హోసూర్‌లో ఒక పెద్ద తయారీ కర్మాగారాన్ని కలిగి ఉంది, ఇక్కడ సంవత్సరానికి 1,50,000 యూనిట్ల ద్విచక్ర వాహనాలను తయారు చేయగలదు. 23 రాష్ట్రాల్లో 150 కొత్త షోరూమ్‌లు, 200 సర్వీస్ సెంటర్లను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.