Maruti e Vitara-Tata Harrier EV: దేశం ఎదురు చూస్తుంది.. విటారా, హారియర్ ఈవీలు వచ్చేస్తున్నాయ్.. రేంజ్ తెలిస్తే షేకే..!

Maruti e Vitara-Tata Harrier EV: ఇప్పుడు దేశంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. కొత్త కార్లు ఒకదాని తర్వాత ఒకటి లాంచ్ అవుతున్నాయి. చాలా కొత్త మోడల్స్ మార్చిలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈసారి చాలా మంది ఎదురుచూస్తున్నది మారుతి సుజుకి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ-విటారా. ఇది మాత్రమే కాదు, టాటా మోటార్స్ హారియర్ ఈవీ ధర కూడా ఈ నెలలో వెల్లడి కానుంది. మీరు ఈ రెండు కార్లను కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Maruti e-Vitara
ఈ నెలలో మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ-విటారాను విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో తొలిసారిగా ఈ-విటారాను కంపెనీ పరిచయం చేసింది. ఈ వెహికల్లో 49 కిలోవాట్, 61 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. వీటిని పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఈ కారు 550 కిలోమీటర్ల పరిధిని అందించగలదు.
భద్రత కోసం, ఈ కారులో 6 ఎయిర్బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, లెవల్-2 అడాస్ వంటివి ఉన్నాయి. ఫీచర్ల గురించి చెప్పాలంటే, 10.25 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.1 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి ఫీచర్లను కారులో చూడచ్చు. మారుతి ఈ-విటారా ధర రూ. 22 లక్షల నుంచి ప్రారంభం కావచ్చు.
Tata Harrier EV
టాటా మోటార్స్ తన కొత్త హారియర్ ఈవీ ధరను ఈ నెలలో వెల్లడించనుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో ఈ వాహనం తొలిసారిగా పరిచయం చేశారు. హారియర్ ఈవీలో 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
ఇది మాత్రమే కాదు, భద్రత కోసం, 6 ఎయిర్బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, ఆటో హోల్డ్, ESC, 360 డిగ్రీ కెమెరాతో సహా అనేక అద్భుతమైన ఫీచర్లను ఇందులో చూడచ్చు. ఇది మాత్రమే కాదు, కొత్త హారియర్ ఈవీలో అడాస్ కూడా ఉంటుంది. అలానే 10 స్పీకర్లతో కూడిన JBL సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 18 లక్షల నుండి ప్రారంభం కావచ్చు.