Last Updated:

Pavani Reddy: భర్త ఆత్మహత్య.. ప్రియుడితో రెండో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్‌ హీరోయిన్‌!

Pavani Reddy: భర్త ఆత్మహత్య.. ప్రియుడితో రెండో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్‌ హీరోయిన్‌!

Pavani Reddy Get Ready to Second Marriage: టాలీవుడ్‌ హీరోయిన్, టీవీ నటి పావని రెడ్డి రెండో పెళ్లికి సిద్దమైంది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. కొరియోగ్రాఫ్‌ ఆమిర్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు వీడియో షేర్‌ చేస్తూ ఏప్రిల్‌ 20న ప్రియుడితో ఏడడుగులు వేయబోతున్నానని, డేట్‌ సేవ్‌ చేసుకోండి అంటూ మురిసిపోయింది. ‘త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానోచ్‌. ఒకరికొకరు తోడుంటామని సముద్రం సాక్షిగా మాట ఇచ్చుకున్నాం. ఇకపై కలిసి జీవిద్దాం’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

పావని రెడ్డి విషయానికి వస్తే తెలుగులో ఆమె చాలా సినిమాలు చేసింది. అయితే అవి పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. దీంతో ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అయితే 2017 తన భర్త, నటుడు ప్రదీప్‌ రెడ్డి ఆత్మహత్యతో పావని పేరు మీడియాల్లో, సోషల్‌ మీడియాల్లో మారుమ్రోగింది. ప్రదీప్‌ రెడ్డి, పావనిలది ప్రేమ వివాహం, ఓ టీవీ సీరియల్లో జంటగా నటించిన వీరిద్దరు ప్రేమలో పడ్డారు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రేమికుల దినోత్సవం రోజే పెళ్లి చేసుకున్నారు.

కానీ ఏమైందో ఏమో ఏడాది తిరక్కుండానే ప్రదీప్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన భార్య మరొకరితో సన్నిహితంగా ఉన్న ఫోటో చూసి అతడు ఈ అఘాత్యానికి పాల్పడ్డాడనే ప్రచారం జరిగింది. కానీ వాటిని పావని ఖండించింది. భర్త ఆత్మహత్య కారణం పావనినే అనే ఆరోపణలతో ఆమె కొన్ని రోజులు వార్తల్లో నిలిచి సన్నేషన్‌ అయ్యింది. తెలుగులో టీవీ సీరియల్‌తో పాటు డబుల్‌ ట్రబుల్‌, డ్రీమ్‌, గౌరవం,లజ్జ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే ఇవి పెద్దగా సక్సెస్‌ కాకపోవడంతో ఆమె అవకాశాలు కరువయ్యాయి.

 

View this post on Instagram

 

A post shared by Pavni (@pavani9_reddy)

దీంతో తమిళ్‌ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో తెలుగులో తెరపై మెరిసింది. అలా ప్రేమకు రెయిన్‌చెక్‌, మళ్లీ మొదలైంది, చారి111 చిత్రాల్లో మెరిసింది. అదే సమయంలో తమిళ్‌ బిగ్‌బాస్‌ అయిదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లిన పావని సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. అదే సీజన్‌లో సహా కంటెస్టెంట్‌ అయిన కొరియోగ్రాఫర్‌ ఆమిర్‌తో ప్రేమలో పడింది. కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న వీరిద్దరు ఇప్పుడు పెళ్లికి సిద్ధం అయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 20 వివాహ బంధంతో ఒక్కటి కాబోతోన్నారు.