Last Updated:

Flax Seeds: హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్‌తో బాధపడుతున్నారు – అవిసె గింజలతో ఇలా చేయండి!

Flax Seeds: హార్మోనల్  ఇన్‌బ్యాలెన్స్‌తో బాధపడుతున్నారు – అవిసె గింజలతో ఇలా చేయండి!

Flax Seeds Health Benfits: అవిసె గింజలు (Flax Seeds) ఇవి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ వాటి ఉపయోగం తెలియక వాటిని వట్టి సీడ్స్‌గానే చూస్తాయి. కానీ అవిసే గింజలు శరీరానికి దివ్వౌషధంగా పని చేస్తాయని మీకు తెలుసా?. ఎన్నో పోషకాలు ఉంటే అవిసే గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడవారికి ఇవి దివ్వౌషధంలా పని చేస్తాయి. పోషకాల పరంగా ఎంతో విలువైనవి ఈ అవిసె గింజలు. విటనే ఇంగ్లీలో ఫ్లక్స్‌ సీడ్స్‌ అంటారు.

వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్, లిగ్నన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అవిసె గింజల్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గించడంలో, అలాగే హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్(HDL)ను పెంచుతాయి. ఈ కారణంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన ఆహారంగా అవిసె గింజలు పనితీరు ఉంటుంది.

అవిసె గింజల్లో ఉండే లిగ్నన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు.. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ముఖ్యంగా రొమ్ము, ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్‌ను తగ్గించే గుణాలను ఇవి కలిగి ఉంటాయి. వీటిలో ఉండే అధిక ఫైబర్ కడుపుని నింపే గుణాన్ని కలిగి ఉంటుంది. దీంతో ఆకలి తగ్గించి, అతిగా తినకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. కాబట్టి బరువుతు తగ్గలానుకునేవారు ఈ అవిసె గింజలను ఏదోక విధంగా మీ డైట్‌లో ఉండేలా చూసుకంటే త్వరలోనే మంచి ఫలితాన్ని చూస్తారు.

చేపల తర్వాత అవిసె గింజల్లోనే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయంటారు.ఈ ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ చర్మాన్ని తేమగా ఉంచి చర్మ సమస్యలను తగ్గిస్తాయి. చర్మంపై మృత కణాలను తొలగించి సహజమైన కాంతిని అందిస్తాయి. అవిసె గింజల వినియోగం జుట్టు రాలడాన్ని తగ్గించి బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతను కూడా ఇవి తగ్గస్తుంది. నిజానికి ప్రస్తతం కాలంలో చాలా మంది ఆడవాళ్లు హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్‌తో బాధపడుతుంటారు. అలాంటి రోజు అవిసే గింజలు తినడం వల్ల ఆ సమస్య క్రమంగా తగ్గుతుంది. ముఖ్యంగా రుతుక్రమ సమస్యలు, మెనోపాజ్ సమయంలో కలిగే లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంఫ్లమేషన్ తగ్గించే గుణాలను కలిగి ఉంటాయి.

ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రభావాన్ని కలిగి ఉండటంతో, శరీరంలోని నొప్పులను, కీళ్ల వేదనలను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి ప్రేగుల కదలికను పెంచి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ముఖ్యంగా అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఇది మధుమేహ రోగులకు ఎంతో మేలు చేస్తుంది. రోజూ అవిసె గింజలను తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించుకోవచ్చు.