Last Updated:

Samsung Galaxy F05: టైమ్ లేదు బ్రో..రూ.6,499లకే సామ్‌సంగ్ కొత్త ఫోన్.. వాయమ్మో ఇదేం ఆఫర్రా..!

Samsung Galaxy F05: టైమ్ లేదు బ్రో..రూ.6,499లకే సామ్‌సంగ్ కొత్త ఫోన్.. వాయమ్మో ఇదేం ఆఫర్రా..!

Samsung Galaxy F05: స్మార్ట్‌ఫోన్ వినియోగం నానాటికి పెరిగి పోతుంది. ఒక్కొక్కరు రెండు ఫోన్లను కూడా వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మీరు కూడా సెకండరీ మొబైల్ వాడాలనుకుంటున్నట్లయితే మీకో శుభవార్త ఉంది. చాలా మంది కస్టమర్లు బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ లెవల్ ధరలో అందుబాటులో ఉండదని అనుకుంటారు. కానీ అది తప్పు. దక్షిణ కొరియా బ్రాండ్ సామ్‌సంగ్ Galaxy F05 శక్తివంతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.6499. ఈ స్మార్ట్‌ఫోన్‌ను బహుమతి కూడా అందివచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ F05 ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 6,499 తగ్గింపు ధరతో జాబితా చేశారు. ఇతర ఆఫర్‌ల ప్రయోజనాలను విడిగా అందించడం జరిగింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్టైలిష్ లెదర్ ప్యాటర్న్, 50MP డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. రండి ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్ 4GB RAM+ 64GB స్టోరేజ్ ఉన్న Samsung స్మార్ట్‌ఫోన్ వేరియంట్‌ను డిస్కౌంట్ తర్వాత రూ.6,499కి జాబితా చేసింది. కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సహాయంతో చెల్లిస్తే, వారు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఇది కాకుండా, పాత ఫోన్‌ను మార్చుకోవడంపై గరిష్టంగా 4800 రూపాయల వరకు తగ్గింపు పొందచ్చు. ఇది దాని మోడల్, పర్ఫామెన్స్‌పై ఆధారపడి ఉంటుంది.

Samsung Galaxy F05 Specifications
ఎంట్రీ-లెవల్ మొబైల్ పెద్ద 6.7-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. సున్నితమైన పనితీరు కోసం MediaTek Helio G85 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో లెదర్ ప్యాటర్న్ ఫిరిషింగ్ కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా సాఫ్ట్‌వేర్‌ను అందిస్తుంది. గెలాక్సీ F05 కంపెనీకి రెండు మెయిన్ Android అప్‌గ్రేడ్లను అందిస్తుంది. డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా దాని స్టోరేజీని పెంచుకునే ఆప్షన్ కూడా ఉంది.

కెమెరా గురించి చెప్పాలంటే.. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కాకుండా, ఫోన్‌లో 2MP సెకండరీ కెమెరా లెన్స్ ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఇది 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. గెలాక్సీ F05 5000mAh కెపాసిటీతో బ్యాటరీని కలిగి ఉంది. USB టైప్-సి పోర్ట్ ద్వారా 25W ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.