Best Budget SUV: ఆల్ టైమ్ బెస్ట్.. అర్బన్ క్రూయిజర్ టైజర్‌పై లక్ష డిస్కౌంట్.. ఫ్యామిలీకి భలేగా ఉంటుంది..!
Best Budget SUV: భారత మార్కెట్లో సరసమైన ధర కలిగిన కాంపాక్ట్ ఎస్‌యూవీలకు భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ఫ్యామిలీ ఎస్‌యూవీగా బాగా నచ్చింది. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర 8 లక్షల కంటే తక్కువ, దీని మైలేజ్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు సమీప భవిష్యత్తులో ఒక SUVని కొనాలనే ప్లాన్ ఉంటే Taserని పరిగణించవచ్చు. దీని పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.
Toyota Urban Cruiser Price And Specifications
భారత మార్కెట్లో టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ధర రూ. 7.74 లక్షల నుండి రూ. 13 లక్షల ఎక్స్-షోరూమ్ మధ్య ఉంది. ఇప్పుడు ఈ SUVని కొనుగోలు చేస్తే, మీరు వేరియంట్‌ను బట్టి రూ. 1 లక్ష వరకు తగ్గింపు పొందచ్చు.
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే ఇందులో 1.2-లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ సిఎన్జి ఇంజన్ ఎంపికలు లభిస్తాయి. దీని 1.2 లీటర్ ఇంజన్ 89 బిహెచ్పి పవర్, 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారులో ఉన్న 1.0 లీటర్ ఇంజన్ 99 బిహెచ్పి పవర్, 148 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. అర్బన్ క్రూయిజర్ టైసర్ లీటరుకు 19.8 నుండి 28.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
కొత్త అర్బన్ క్రూయిజర్ టైజర్ ట్విన్ ఎల్ఈడీ డీఆర్ఎల్తో కూడిన కొత్త LED టైల్లైట్లను కలిగి ఉంది. దీని లోపలి భాగంలో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ట్విన్ పాడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అదే సమయంలో భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, హెడ్అప్ డిస్ప్లే, క్రూయిజ్ కంట్రోల్‌తో కూడిన ఆటోమేటిక్ LED హెడ్‌ల్యాంప్‌లు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో ఇది మారుతి సుజుకి ఫ్రాంక్స్, హ్యుందాయ్ ఐ20, టాటా పంచ్ వంటి వాహనాలతో పోటీపడుతుంది.
ఈ ఎస్యూవీ సింగిల్ టోన్ కలర్ ఆప్షన్లలో కేఫ్ వైట్, ఎంటైసింగ్ సిల్వర్, స్పోర్టిన్ రెడ్, గేమింగ్ గ్రే, లూసెంట్ ఆరెంజ్ మరియు బ్లాక్ రూఫ్ (స్పోర్టిన్ రెడ్, ఎంటైసింగ్ సిల్వర్, కేఫ్ వైట్) వంటి డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో 308 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ ఉంది. మీరు సరసమైన ధరలో SUV కోసం చూస్తున్నట్లయితే అర్బన్ క్రూయిజర్ టైజర్‌ను పరిగణించవచ్చు.