Last Updated:

Tokyo Airport: టోక్యో ఎయిర్ పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు.

టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏల్‌ 516 విమానంల్యాండ్ అవుతుండగా మరో విమానం ఢీకొనడంతో మంటల్లో చిక్కుకుంది. జపనీస్ కోస్ట్ గార్డ్ విమానం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అది కూడా మంటల్లో చిక్కుకుంది.

Tokyo Airport: టోక్యో ఎయిర్ పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు.

Tokyo Airport: టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏల్‌ 516 విమానంల్యాండ్ అవుతుండగా మరో విమానం ఢీకొనడంతో మంటల్లో చిక్కుకుంది. జపనీస్ కోస్ట్ గార్డ్ విమానం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అది కూడా మంటల్లో చిక్కుకుంది.

రన్‌వేలపై కార్యకలాపాలను నిలిపివేత..(Tokyo Airport)

విమానంలో 12 మంది సిబ్బందితో సహా 379 మంది ప్రయాణిస్తున్నారు. వారందరినీ సురక్షితంగా తరలించారు. ఈ రెండు విమానాలు ఢీకొనడానికి కారణాలు అస్పష్టంగా ఉన్నాయి. తమ MA722 ఫిక్స్‌డ్‌ వింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఢీకొన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు జపాన్ కోస్ట్ గార్డ్ తెలిపింది.కోస్ట్ గార్డ్ విమానంలో ఆరుగురు సిబ్బంది ఉన్నారని, వారందరినీ గుర్తించామని చెప్పారు. జపాన్‌లోని షిన్ చిటోస్ విమానాశ్రయం నుండి ఈ విమానం వచ్చినట్లు స్థానిక మీడియా నివేదించింది.ఈ ఘటనతో హనేడా విమానాశ్రయం అన్ని రన్‌వేలపై కార్యకలాపాలను నిలిపివేసింది. జపాన్‌లోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో హనేడా ఒకటి.