Last Updated:

Xiaomi 14 Price Drop: మొబైల్ లవర్స్‌కి పండగే.. తక్కువ ధరకే షియోమి ఫోన్.. ఆఫర్లతో దూసుకొచ్చింది..!

Xiaomi 14 Price Drop: మొబైల్ లవర్స్‌కి పండగే.. తక్కువ ధరకే షియోమి ఫోన్.. ఆఫర్లతో దూసుకొచ్చింది..!

Xiaomi 14 Price Drop: స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమి తన కస్టమర్లకు రెండు శుభవార్తను అందించింది. త్వరలో Xiaomi 15 సిరీస్‌ను భారతదేశంలో ప్రారంభించనుంది. అయితే దీనికి ముందు Xiaomi 14ఫోన్ ధరను రూ. 20,000 తగ్గించింది. మీరు అమెజాన్‌లో రూ. 24,000 తక్కువ ధరకు ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉన్నాయి. రండి ఈ ఫోన్ కొత్త ధర, ఫీచర్లను తెలుసుకుందాం.

కంపెనీ మార్చి 14న భారతదేశంలో Xiaomi 14 మొబైల్‌ను విడుదల చేసింది. క్వాల్‌‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వచ్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇది. ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో 6.36 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది 4610mAh బ్యాటరీ, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో సహా అనేక ఫీచర్లతో వస్తుంది.

కంపెనీ Xiaomi 14 ఫోన్‌ను 12GB RAM + 512GB స్టోరేజ్ ఆప్షన్‌లో మాత్రమే విడుదల చేసింది. ఈ ఫోన్ లాంచ్ ధర రూ.69,999 ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10 వేలు తగ్గింది. మీరు ఫోన్‌ను రూ. 59,999కి కొనుగోలు చేయవచ్చు.

Xiaomi 14 మొబైల్‌ను ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. Mi.comలో ఈ ఫోన్ రూ.59,999కి అందుబాటులో ఉంది. అమెజాన్‌లో రూ. 45,999కి విక్రయిస్తోంది. అంటే మీరు లాంచ్ ధర కంటే 24,000 రూపాయలకే Xiaomi 14ని పొందవచ్చు. తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Xiaomi 14 Features
షియోమి 14 మొబైల్ 6.36-అంగుళాల పంచ్-హోల్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్‌నెస్, 2160PWM డిమ్మింగ్ సపోర్ట్, 2670 x 1200 పిక్సెల్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెక్నాలజీని కలిగి ఉంది. ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం ఇది Adreno 750 GPUని కూడా కలిగి ఉంది.

Xiaomi 14 మొబైల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్ లైకా లెన్స్‌ని ఉపయోగిస్తుంది. ఇది OIS మద్దతుతో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. దీనితో పాటు 50-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా,  50-మెగాపిక్సెల్ మూడవ కెమెరా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ మొబైల్ 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. కంపెనీ Xiaomi 14 ఫోన్‌లో 4610mAh బ్యాటరీని ఇన్‌స్టాల్ చేసింది.

ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఫోన్‌లో 90W ఫాస్ట్ ఛార్జింగ్  ఉంది. 50W వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా అందించారు.స్మార్ట్‌ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, 17 5G బ్యాండ్‌లు ఉన్నాయి.